ఆ సీఎం ఆస్తి ఇంత తక్కువా ?

Update: 2021-03-12 03:49 GMT
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తుల లెక్క తేలింది. జనాభా పరంగా దేశంలోనే నాలుగో అతిపెద్ద రాష్ట్రమైన బెంగాల్ కు గడిచిన 10 ఏళ్లుగా సీఎంగా మమత కొనసాగుతున్నారు. సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఆమె ఎన్నెన్నో పదవులు చేపట్టారు.

70వ దశకంలో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా విధానాలు మార్చుకున్నారేమో కానీ.. సింప్లిసిటీని మాత్రం వదలలేదు. బంగారు ఆభరణాలు, విలాసవంతమైన జీవితానికి మమత దూరంగా ఉంటారు.

బెంగాల్ ఎన్నికల వేళ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ద్వారా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తి విలువ ఎంతో తెలిసింది. నామినేషన్ సందర్భంగా ఆమె ఆస్తుల వివరాలు తెలియవచ్చాయి.

ఈసీకి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం మమతా బెనర్జీ ఆస్తి రూ.16.72 లక్షలుగా తేలింది. ఇదంతా చరాస్తి రూపంలోనే ఉందని.. స్థిరాస్తులు ఏవీ లేవని ఆమె పేర్కొంది. 2016లో తన ఆస్తిని రూ.30.45 లక్షలుగా ప్రకటించింది. ఈ ఐదేళ్లలో సగం ఆస్తి కరిగిపోయింది.

తాజాగా తన వద్ద కేవలం 9 గ్రాముల బంగారం, వాటి విలువ 43వేలుగా పేర్కొంది. చేతిలో రూ.69255 రూపాయలు ఉన్నాయని.. ఎన్నికల ఖర్చు రూ.1.51 లక్షలతోపాటు బ్యాంకులో రూ.13.53 లక్షలు, సేవింగ్స్ రూ.18490, మొత్తం కలిపి రూ.16.72 లక్షలుగా మమత ఆస్తిని చూపింది.

పలు అంశాలపై రచనలు చేసిన ఆమె పుస్తకాల అమ్మకపు రాయల్టీగా రూ.930 ఆదాయం సమకూరినట్లు పేర్కొనడం విశేషం. ఇక 2019-20 ఆర్థిక సంవత్సరంలో తన సంపాదనను రూ.10,34,370 గా పేర్కొంది.
Tags:    

Similar News