రిషి సునక్ ఫ్యామిలీ నేపథ్యం ఇదే!

Update: 2022-10-25 05:31 GMT
రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. భారత సంతతికి చెందిన రిషి మనల్ని పాలించిన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఏలుతుండడంతో భారతీయులు ఉప్పొంగిపోతున్నారు. రిషి సునక్ ఎవరు? ఎక్కడి వారు అని ఆరాతీస్తున్నారు. అతడు మన భారతీయుడైనందుకు గర్విస్తున్నామని ట్వీట్లు చేస్తున్నారు.

రిషి సునాక్ తాతలు పంజాబ్ కు చెందిన వారని తేలింది. వీరు మొదట టాంజానియా, కెన్యాకు వెళ్లారు. అక్కడి నుంచి 1960లో బ్రిటన్ వెళ్లి స్థిరపడ్డారు. ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ నగరంలో రిషి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఉష, యశ్ వీర్. భారత్ లోని పంజాబ్ లో రిషిసునాక్ తల్లిదండ్రుల మూలాలున్నాయి.  సునాక్ తండ్రి యశ్ వీర్ వైద్యులు కాగా.. తల్లి మెడికల్ షాప్ నిర్వహించేవారు. ఆక్స్ ఫర్డ్ లో ఫిలాసఫీ, ఎకనామిక్స్ అభ్యసించారు. తొలిసారి 2015లో రిచ్ మండ్ ఎంపీగా రిషి సునాక్ ఎన్నికయ్యారు. 2017, 2019లలోనూ తిరిగి ఎన్నికయ్యారు. 2020 ఫిబ్రవరిలో బోరిస్ జాన్సన్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా నియమితులై ఈ ఏడాది జులై వరకూ కొనసాగిన విషయం తెలిసిందే.

స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి కుమార్తె అక్షతతో రిషి సునాక్ కు పరిచయం ఏర్పడింది. రిషి సునక్ భార్య ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి.  

అది ప్రేమగా మారింది. నాలుగేళ్ల అనంతరం బెంగళూరులో 2009లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు అనౌక్ష, కృష్ణ ఉన్నారు. రిషి తన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

హిందూ మతాచారాలను ఆచరిస్తారు. మొదటి సారి ఎంపీగా ఎన్నికైన సందర్భంలో భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. . గోపూజలు చేస్తారు. సో హిందూ సంప్రదాయాన్ని పాటించే ఒక హిందువే బ్రిటన్ ప్రధాని కావడం విశేషం.

సామాన్యుడిగా మొదలైన రిషి సునాక్ తన కృషి, పట్టుదలతో బ్రిటన్ ప్రధాని స్థాయికి ఎదిగారు. కన్జర్వేటివ్ పార్టీలో కొత్త తరం నాయకుడిగా పేరు తెచ్చుకొని బ్రిటన్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి చరిత్ర సృష్టించారు. బ్రిటన్ సంక్షోభం వేళ ఆర్థిక మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News