'కరోనా'కి .. డెల్టా వేరియంట్ కి తేడా ఇదే !

Update: 2021-06-24 04:30 GMT
కరోనా మహమ్మారి జోరు ఈ మధ్య  కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో కరోనా మహమ్మారి జోరు తగ్గుముఖం పడుతుంది. కానీ, రోజుకో కొత్త వేరియంట్ వెలుగులోకి వస్తూ, ఆందోళనకి గురిచేస్తుంది. ఈ మధ్య వెలుగులోకి వచ్చి స్వైరవిహారం చేస్తున్న వేరియంట్ డెల్టా వేరియంట్. ఈ డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. ఇదిలా ఉంటే ..డెల్టా వేరియంట్ లో   జ్వరం, దగ్గు, వాసన లేకపోవడం వంటి మూడు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మే 21 నుంచి కనిపించిన లక్షణాలు మాత్రం, తలనొప్పి, గొంతు మూసుకుపోవడం, ముక్కు కారడం వంటివి కూడా కనిపించాయి.

ఈ లక్షణాలతో పాటుగా మరో 10లక్షణాలను కనుగొన్నారు లండన్ కింగ్స్ కాలేజీ నిపుణులు. యూకేలో ప్రస్తుతం మోస్ట్ డామినెంట్ గా మారిన ఈ డెల్టా వేరియంట్ పై రీసెంట్ గా స్టడీ చేశారు.  మే నుండి  కనిపిస్తున్న లక్షణాలు గతంలో ఉన్న వాటికంటే కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ వేరియంట్ తీరు కొద్దిగా భిన్నంగా ఉంది. దీనిపై ప్రొఫెసర్ స్పెక్టార్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతులైన వారిలో ఎక్కువగా కనిపించిన లక్షణం ఎక్కువ మోతాదులో జలుబు చేయడం. ఇతరులు మాత్రం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇది చూసి చాలా మంది సీజనల్ జలుబుగా అనుకుంటున్నారు.

అలా వెళ్లి పార్టీల్లో ఒకరి నుంచి ఆరుగురికి వైరస్ వ్యాప్తి చేస్తున్నారు. ఇదే ప్రధాన సమస్య అని చెప్తున్నారు. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన కరోనా అన్ని వేరియంట్ల కంటే డెల్టా వేరియంట్ హైపర్ ఇన్ఫెక్షియస్ గా తయారైంది. సాధారణ వేరియంట్ తనతో పాటు ఉన్న ముగ్గురికి ఇన్ఫెక్ట్ చేస్తుండగా డెల్టా వేరియంట్ ఆరుగురికి అంతకంటే ఎక్కువ వ్యాప్తి చెందేలా చేస్తుందట. ప్రస్తుతం ఈ డెల్టా వేరియంట్ అమెరికా ఇన్ఫెక్షన్లలో 6 శాతం ఉన్నట్లు తెలుస్తుంది. ఇతర దేశాల్లో మరింత ప్రమాదకరంగా మారింది.  ఈ మద్యే  సదరన్ చైనాకు కూడా పాకింది. ఆ చైనా డాక్టర్లే స్టార్టింగ్ లో కనిపించిన కరోనా కంటే ఇది తీవ్రంగా ఉందని వెల్లడించారు. మనదేశంలోని నిపుణులు ఈ కరోనా కొత్త వేరియంట్, డెల్టా వేరియంట్ కారణంగా  ఎక్కువుగా వినికిడి సమస్యలు, కడుపులో ఇబ్బంది, రక్తం గడ్డకట్టడం వంటివి ఉన్నట్లు తెలిపారు.

Tags:    

Similar News