గత రెండేళ్లు ప్రపంచాన్ని కోవిడ్ -19 పీల్చిపిప్పి చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. కోటిన్నర మంది మరణించారు. మనదేశంలో 25 లక్షల మందికి పైగా మరణించారని ఒక అనధికారిక అంచనా. కోవిడ్‌తో దేశాల ఆర్థిక వ్యవస్థలు తల్లకిందులయ్యాయి. ఇప్పుడిప్పుడే కోవిడ్ సృష్టించిన కల్లోలం నుంచి ఆయా దేశాలు, ప్రజలు బయటపడుతున్నారు.
అయితే ఇంతలోనే మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రపంచ దేశాలను కల్లోలపరుస్తుంది. ఆగస్టు 30 నాటికి ప్రపంచవ్యాప్తంగా 55 వేల మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. ఒక్క అమెరికాలోనే 17,500 కేసులు బయటపడ్డాయి. మనదేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. మొదటగా దుబాయ్ నుంచి కేరళ వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకింది. ఆ తర్వాత అతడు మరణించాడు.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 92 దేశాల్లో మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. మొత్తం 55 వేల మంకీపాక్స్ కేసుల్లో 12 మంది మృత్యువాత పడ్డారు.
కాగా కోవిడ్ లో కొత్త వేరియంట్లు బయటపడ్డట్టే మంకీపాక్స్ లోనూ కొత్త రకాలు బయటపడుతున్నాయి. తాజాగా బ్రిటన్‌లో మంకీపాక్స్ కొత్త రకం వెలుగు చూసింది. పశ్చిమ ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు ఇంగ్లండ్ వైద్యాధికారులు తెలిపారు. ఐరోపా దేశాల్లో మంకీపాక్స్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెప్పిన కొన్ని రోజుల్లోనే కొత్త రకం వెలుగు చూడటం సర్వత్రా ఆందోళన నింపింది.
కాగా ప్రస్తుతం బ్రిటన్‌లో వ్యాప్తిలో ఉన్న మంకీపాక్స్ రకానికి, తాజాగా బయటపడిన రకానికి తేడా ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌లోనూ ప్రాథమికంగా ఇదే తేలిందని అంటున్నారు. ప్రస్తుతం కొత్త రకం మంకీపాక్స్ సోకిన రోగి రాయల్ లివర్‌పూల్ యూనివర్సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలుస్తోంది. ప్రమాదకర వైరస్ వ్యాప్తిపై ఏర్పాటు చేసిన సలహా కమిటీ(అడ్వైజరీ కమిటీ ఆన్ డేంజరస్ పాథోజెన్స్) సూచన మేరకు బాధితుడిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు ఇంగ్లండ్ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు ఇదే సమయంలో మంకీపాక్స్ కొత్త రకం సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చే వాళ్లలో మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని కోరింది. మరోవైపు.. స్థానికంగా వైరస్ వ్యాప్తి కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.