మూడు రాజధానులపై ప్రధాని మాట ఇదే

Update: 2020-03-17 09:45 GMT
ఏపీలో మూడు రాజధానులపై అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. మూడు రాజధానుల ఏర్పాటుపై కేంద్రం ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా నోరు విప్పలేదు. తొలిసారిగా ప్రధాని మోదీ దీనిపై స్పందించారు. ఏపీలో పరిస్థితులు, జగన్‌ వ్యవహార శైలిపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్.. ప్రధాని మోడీకి లేఖ రాసారు. ఏపీలో హాట్ టాపిక్‌ అయిన మూడు రాజధానుల అంశాన్నీ తన లెటర్‌ లో ప్రస్తావించారు. ఏపీకి 3 రాజధానుల అవసరం లేదని, వైసీపీ వాళ్లు భూములు అమ్ముకోవడానికి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే త్రీ క్యాపిటల్‌ అంటున్నారని లేఖలో వివరించారు. మూడు రాజధానులు ఏర్పాటయితే రాష్ట్ర భవిష్యత్‌ నాశనమవుతుందని పేర్కొన్నారు. జగన్‌ ఆలోచన దేశ సమగ్రతకూ ముప్పున్నారు. ఈ ప్రయాత్నాలను కేంద్ర అడ్డుకోవాలని మోడీకి రాసిన లేఖలో కనక మేడల విన్నవించారు.

కనమేడల లేఖపై ప్రధాని స్పందించారు. లేఖ తమకు అందిందని, మూడు రాజధానుల అంశంపై తమకూ సమాచారం ఉందని, ఆ విషయాన్ని పరిశీలిస్తున్నామని రిప్లై ఇచ్చారు. మూడు రాజధానుల అంశం కేంద్రం దృష్టిలో ఉందని ఈ ప్రత్యుత్తరం తో తేలిపోయింది. స్టేట్‌ గవర్నమెంట్‌ నిర్ణయం పై సెంటర్‌ రియాక్షన్‌ పాజిటివ్‌ గా ఉంటుందా, నెగెటివ్‌ గా ఉంటుందా అన్నది తేలాలి. కాగా, మూడు రాజధానుల అంశంపై మోడీ ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు. కనీసం సింగిల్‌ లైన్‌ ట్వీట్‌ కూడా చేయలేదు. తొలిసారి కనకమేడల లేఖకు సమాధానం ఇచ్చారు. మోడీ రిప్లైతో రాజకీయ వర్గాలు మళ్లీ అలెర్టయ్యాయి. కేంద్ర నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Tags:    

Similar News