ఐర్లాండ్ లో ఉన్న పురాతన శివలింగం రహస్యం ఇదే !

Update: 2021-03-12 13:30 GMT
బోళాశంకరుడు .. భక్తులు ఒక్కసారిగా శివయ్య అంటే చాలు చలించి వారి కోర్కెలు తీర్చేస్తాడు. శివుడికి మన భారతదేశంలోనే కాదు చాలా దేశాల్లో ఆలయాలు ఉన్నాయి. అయితే , ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన శివాలయం ఎక్కడ ఉంది అంటే .. ఖచ్చితంగా మనదేశంలోనే అని చాలామంది చెప్తారు. కానీ మనకు తెలియని ఎన్నోరహస్యాలు ఉన్నాయి.  ఈ భూమిపై ఎన్నో ప్రాంతాల్లో పరమ శివుడు పూజలందుకుంటున్నాడు. ఐర్లాండ్‌ లో ఓ పురాతన ఓ శివలింగం ఉంది. మీత్ కౌంటిలోని తారా పర్వత ప్రాంతాల్లో కొలువైన  పొడువాటి శివలింగం వెనక ఎన్నో రహస్యాలు దాగున్నాయి. చుట్టూ రాతి ఇటుకలతో పొడవైన శిలగా ఉంటుంది. వందల ఏళ్ల కింద దీన్ని గుర్తించారు.  స్థానికులు ' లియా ఫెల్ ' అని పిలుస్తారు. అంటే అదృష్ట శిల అని అర్థం. ఈ శివలింగాన్ని ధ్వంసం చేసేందుకు గతంలో చాలా మంది ప్రయత్నించారు. కానీ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఇప్పటికీ అలానే ఉంది.

2012లో ఓ వ్యక్తి ఏకంగా 11 సార్లు దాడి చేసినా..2014లో కొందరు వ్యక్తులు శివలింగంపై పెయింట్ పోశారు. మరెన్నోసార్లు క్షుద్రపూజలు చేసిన ఘటనలు జరిగాయి. కానీ, ఆ శివలింగానికి ఏమి జరగలేదు.  క్రీ.శ. 1632-1636 మధ్య కాలంలో ఫ్రెంచ్ సాధువులు రచించిన పురాతన గ్రంథం ది మైనర్స్ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్  లో శివలింగానికి సంబంధించిన కొన్ని వివరాలు ఉన్నాయి. తుథాడి దేనన్ వర్గానికి చెందిన ఓ నేత దీన్ని స్థాపించినట్లు అందులో పేర్కొన్నారు. తుథాడి దేనన్ అంటే దను దేవత పిల్లలు అని అర్థం. వీళ్లు క్రీ.పూ. 1897 నుంచి 1700 వరకు  ఐర్లాండ్‌ని పాలించారు. క్రైస్తవ సన్యాసులు ఈ శివలింగాన్ని పునరుత్పతి సామర్థ్యానికి చిహ్నంగా భావించేవారు. అంతేకాదు ఎంతో మంది ఐరిష్ రాజుల పట్టాభిషేకాలు సైతం ఇక్కడే జరిగినట్లు చరిత్ర చెబుతోంది.

యూరోపియన్ సంప్రదాయాల్లో దనను నదీ దేవతగా కొలుస్తారు. ఆమె పేరు మీదుగానే దేన్యూబ్, దోన్, డనీపర్, డినియెస్టర్ నదులకు పేర్లు పెట్టారు.  ఇక మన వేద సంస్కృతిలోనూ దును దేవత ప్రస్తావన ఉంది. ఆమె దక్ష ప్రజాపతి కూతురు.  కశ్యప ముని భార్య. నదీ దేవతగా కొలిచేవారు.  దను సోదరి సతీ దేవి. శివుడిని పెళ్లి చేసుకుంది. తదుపరి జన్మలో  సతీదేవి పార్వతిగా అవతారమెత్తి శివుడిని వివాహం చేసుకుంది. వేద సంస్కృతిని విశ్వసించే వాళ్లు ఐర్లాండ్‌లోని  లియా ఫైల్‌ని శివలింగంగా భావిస్తారు. యూరోపియన్ సంప్రదాయాల్లో దనను నదీ దేవతగా కొలుస్తారు. ఆమె పేరు మీదుగానే దేన్యూబ్, దోన్, డనీపర్, డినియెస్టర్ నదులకు పేర్లు పెట్టారు.  ఇక మన వేద సంస్కృతిలోనూ దును దేవత ప్రస్తావన ఉంది. ఆమె దక్ష ప్రజాపతి కూతురు.  కశ్యప ముని భార్య. నదీ దేవతగా కొలిచేవారు.  దను సోదరి సతీ దేవి. శివుడిని పెళ్లి చేసుకుంది. తదుపరి జన్మలో  సతీదేవి పార్వతిగా అవతారమెత్తి శివుడిని వివాహం చేసుకుంది. వేద సంస్కృతిని విశ్వసించే వాళ్లు ఐర్లాండ్‌లోని  లియా ఫైల్‌ని శివలింగంగా భావిస్తారు.

శివలింగాల్లో రకాలు

1. దేవ లింగం: దేవుళ్లు, ఇతర జీవులు నెలకొల్పిన శివలింగాలు.
2. అసుర లింగం: రావణాసురుడు వంటి అసురులు ప్రతిష్టించిన లింగాలను అసుర లింగాలుగా పిలుస్తారు.
3. అర్ష లింగం: ప్రాచీన కాలంలో అగస్త్య ముని శివలింగాన్ని నెలకొల్పారు. అలాంటి వాటిని అర్ష లింగమంటారు.
4. పురాణ లింగం: పురాణాల్లో ప్రముఖ వ్యక్తులు స్థాపించిన వాటిని పురాణ లింగాలుగా పిలుస్తారు.
5. మానవ లింగం: ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు రాజులు, ధనవంతులు ప్రతిష్టించిన విగ్రహాలు
6. స్వయంభు లింగం: కొన్ని చోట్ల సాక్షాత్తు శివుడే వెలిసినట్లు ఆధారాలు ఉన్నాయి.వాటి స్వయంభు లింగాలంటారు.
Tags:    

Similar News