ఆమె అలాంటి ఇలాంటి మహిళ కాదు. దేశంలో అత్యంత అధికారం చేతుల్లో ఉన్న మహిళ. దేశ ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని ఆమె డిసైడ్ చేసే సత్తా ఉంది. అలాంటి స్థానంలో ఉండి కూడా చాలా సింఫుల్ గా వ్యవహరించటం అంత తేలికైన విషయం కాదు. అత్యున్నత స్థితిలో ఉండి కూడా అతి సాధారణంగా వ్యవహరించే ధోరణి ఆమెను పార్టీలకు అతీతంగా అభిమానించేలా చేస్తుంది. ఆమే.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర విత్త మంత్రిగా నాలుగోసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఆమె.. ఎప్పటిలానే సింఫుల్ గా కనిపించారు.
సాధారణంగా బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరించే వారి వస్త్రధారణపై అందరి ఫోకస్ ఉంటుంది. అయితే.. నిర్మలా సీతారామన్ చాలా క్యాజువల్ గా ఉంటారు. ఆడంబరాల జోలికి అస్సలు వెళ్లరు. సాదాసీదాగా ఉండే ఆమె.. తాజాగా తన బడ్జెట్ ప్రసంగ సమయంలోనూ అదే తీరును ప్రదర్శించారు. బ్రౌన్.. రెడ్ కలగలిసిన చీరకు ఆఫ్ వైట్ బర్డర్ తో ఉన్న చీరను ధరించారు.
చేనేత వస్త్రాల్ని ధరించేందుకు మక్కువ చూపే నిర్మలమ్మ.. బడ్జెట్ ప్రసంగ వేళలోనూ అదే తీరును ప్రదర్శించారు. ఈ తెలుగింటి కోడలు ధరించిన చీర ఒడిశాకు చెందినది కావటం.. అక్కడ ఫేమస్ కావటం గమనార్హం. ఒడిశాలోని బొమ్మై పట్టు చీరను ఆమె ధరించారు. ఈ చీర ఆ రాష్ట్రంలో చాలా ఫేమస్ అని చెబుతారు.
ఒడిశాలోని సోనేపురి జిల్లాలో ఎక్కువగా ఈ చీరల్ని నేస్తారు. అందుకే.. వీటిని సోనేపురి చీరలుగా కూడా పిలుస్తారు. ఖరీదైనది కాదు కానీ.. ఒక మోస్తరు ధర ఉండి ఉండొచ్చని చెబుతున్నారు. మెడలో సన్నటి బంగారు చైను.. చేతికి బంగారు గాజులు వేసుకొని.. మన పక్కింటి పెద్దమ్మ మాదిరి ఉన్న సీతారామన్ తన సింపుసిటీతో పలువురిని ఆకర్షించారని చెప్పక తప్పదు.