చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కి , సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్ కి మంచి అభినాభవ సంబంధం ఉంది. ఎంతలా అంటే లోకేష్ బాబు ట్విట్టర్ లో తప్ప ..బయట ఎక్కడా కనిపించడు. ప్రస్తుతం ఏపీ లో రాజధాని పై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. దీనిపై రాష్ట్రం లోని నేతలంతా మీడియా ముందుకు వచ్చి తమ కి ఇష్టం వచ్చిన విధంగా తమ స్పందనని తెలియజేస్తుంటే . రాజధాని విషయంలో లోకేష్ మాత్రం ట్విట్టర్ లోనే తన శైలిలో సీఎం జగన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శుక్రవారం కూడా ఆయన అదే పంథాను కొనసాగించాడు.
పేదరికానికి కూడా కులం ఉంటుందా అంటూ పలు అంశాలను సీఎం దృష్టి కి తీసుకొస్తూ ఆయన ప్రశ్నించాడు. రాజధాని కోసం 29,881 మంది రైతులు 34,322 ఎకరాలు ఇచ్చాడని చెప్పాడు. వీరిలో ఒక ఎకరం కంటే తక్కువ ఉన్న రైతులు 20,490 మంది అని, 1- 2 ఎకరాల మధ్య ఉన్న వారు 5,227 మంది, కేవలం 159 మందికి మాత్రమే 10 ఎకరాల కు మించి భూమి ఉందని ఆయన వివరాలు వెల్లడించాడు. అందు లో కూడా కొంత మందివి ఉమ్మడి కుటుంబాలున్నాయని తెలిపాడు. 25,717 మంది అంటే సుమారు 90 శాతం మంది సన్నకారు రైతులేనని చెప్పాడు. వైసీపీ నేతలు వీళ్లకేనా కులం అంటగట్టి కక్ష తీర్చుకుం టోందని లోకేశ్ నిలదీశాడు. ఈ పేదలేనా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ చెబుతోంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.
లోకేశ్ ఒక విషయాన్ని మరచి పోయినట్టు ఉన్నాడు. రాజధానికి భూములిచ్చిన వారి తో సమస్య కాదు. రాజధాని రైతులను మోసం చేసి ముందస్తు గానే రాజధాని ఎక్కడొస్తున్నదో తెలుసుకుని కేవలం ఆరు నెలల్లో 4,070 ఎకరాలకు పైగా కొన్న భూ బకాసురులతోనే ఇప్పుడు అసలు సమస్య. 2014 జూన్ ఒకటి నుంచి డిసెంబర్ వరకు కేవలం ఆర్నెళ్ల వ్యవధి లో జగ్గయ్య పేటలో ఎకరా రూ.లక్ష చొప్పున 498 ఎకరాలను కొన్న వీబీసీ ఫర్టిలైజర్స్ యజమాని ఎంఎస్ బీ రామారావు ఏమవుతాడో లోకేశ్ సమాధానం చెప్పాలి. తన మామ బాలకృష్ణ కు ఆయన వియ్యంకుడు అవుతాడనే వాస్తవాన్ని లోకేశ్ ఎందుకు దాస్తున్నాడు? తన సొంత సంస్థ హెరిటేజ్ కు 14.22 ఎకరాలు కొనుగోలు చేసిందాన్ని ఎందుకు చెప్పడం లేదు? ప‌్రస్తుతం విజయవాడ లో తండ్రి తో కలిసి ఉంటున్న లింగమనేని రమేష్ 351 ఎకరాల కొనుగోలు చేయడం వెనుక భూ భాగోత దోపిడీ మాటేమిటి? రాజధాని ఎంపిక కమిటీకి నేతృత్వం వహించిన మాజీ మంత్రి నారాయణ తన బినామీల తో కొనుగోలు చేసిన 55 ఎకరాలు...ఇలా పెద్ద లిస్ట్ ఉంది.
రాజధాని రైతుల పై ఎవరికీ కక్ష లేదు. ఎందుకంటే వారు రాజధాని కోసం భూమిలిచ్చారు. కానీ మీరు రాజధాని భూములు కొన్నవాళ్లు. ఆ రెండింటికి చాలా తేడా ఉంది. ఒకరేమో మోసపోయిన వాళ్లు మరొకరు మోసగించిన వాళ్లు. ప్రస్తుతం రాజధాని తరలింపు ఆలోచనకు మీ దోపిడీ కారణం కాదా? అంటూ కొందరు నేతలు లోకేష్ పై ఫైర్ అవుతున్నారు. అలాగే లోకేష్ దైర్యం ఉంటె వీటికి సరైన సమాధానం చెప్పి ..ఆ తరువాత మాట్లాడాలి అని సవాల్ విసురుతున్నారు.