ఇప్పుడు జరుగుతున్న ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్) అసెంబ్లీ ఎన్నికల్లో అందరి చూపు ఉత్తరప్రదేశ్ మీదనే. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్.. విలక్షణ రాజకీయానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. పేరుకు పెద్ద రాష్ట్రమే అయినా.. డెవలప్ మెంట్ లో మాత్రం వెనుకబడి ఉంది.
దేశంలో వెనుకబడిన రాష్ట్రాల్లో యూపీ ఒకటి. ఈ రాష్ట్రానికి చెందిన ఎంతోమంది దేశంలోని ప్రధాన నగరాలకు వలస వెళ్లి.. కూలీలుగా.. చిన్న పనులు చేసుకుంటూ బతకటం చూస్తుంటాం. వైశాల్యంలో ఐదో పెద్ద రాష్ట్రంగా పేరున్న ఈ రాష్ట్ర రాజధాని లక్నోఅయినప్పటికీ.. రాష్ట్ర హైకోర్టు మాత్రం అలహాబాద్ లో ఉంటుంది.
జనాభా పరంగా చూసినప్పడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాలు ప్రపంచంలో ఐదు మాత్రమే కనిపిస్తాయి. చైనా.. భారత్.. యూఎస్.. ఇండోనేషియా.. బ్రెజిల్ మాత్రమే. ఈ రాష్ట్రంలో మొత్తం 70 రాష్ట్రాల సమ్మిళతం.. అయితే.. వీటిని 17 విభాగాలుగా పరిగణిస్తారు.
యూపీ నైసర్గిక పరిస్థితుల ఆధారంగా యూపీని వాయువ్య(రోహిల్ ఖండ్).. నైరుతి (బిజ్).. మధ్య(అవద్).. ఉత్తర (బుందేల్ ఖండ్).. తూర్పు (పూర్వాంచల్)గా అభివర్ణిస్తారు. మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలతో.. 80 లోక్ సభ స్థానాలుఉన్నాయి. ఈ కారణంగానే యూపీలో ఏపార్టీ అత్యధిక లోక్ సభ స్థానాల్ని గెలుచుకుంటుందో.. ఆ పార్టీ కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలకభూమిక పోషిస్తుందని చెప్పాలి.
2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 62 స్థానాల్లో విజయం సాధించింది. మిత్రులతోకలిసి మరోరెండుస్థానాలు మొత్తం 64 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం80 స్థానాలకు 64 స్థానాలు సొంతం చేసుకోవటంతో.. మోడీ నాయకత్వంలోని బీజేపీ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవటానికి అవకాశం ఏర్పడింది. 2014లో యూపీలో బీజేపీ 71 స్థానాల్ని గెలిచి.. కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పాటులో కీలక భూమిక పోషించిందని చెప్పాలి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న యూపీ ఓటర్లకు సంబంధించి ఆసక్తికర అంశం ఒకటి ఉంది.
ప్రపంచంలో అత్యధిక ఓటర్లు ఉన్న దేశాల జాబితాలో యూపీ ఓటర్లను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే.. కేవలం మూడు దేశాలు మాత్రమే కనిపిస్తాయి. యూపీలో మొత్తం 15.2 కోట్ల మంది ఓటర్లు ఉంటారు. యూపీ కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న దేశాలు అమెరికా 25.9 కోట్లు.. ఇండోనేషియా 19.2 కోట్లు.. బ్రెజిల్ 15.3 కోట్ల మంది ఉంటారు. ఈ మూడు దేశాలు మినహా ప్రపంచంలోని మిగిలిన దేశాలన్ని (ప్రజాస్వామ్య రీతిలో ఎన్నికలు జరిగే) యూపీ ఓటర్ల కంటే తక్కువగా ఉంటాయి. మన పొరుగున ఉన్న పాకిస్థాన్ ఓటర్లు మొత్తం 13.2 కోట్లు కాగా.. అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండటం గమనార్హం.