భగవంతుడా..! ఏమిటీ పరీక్ష.. కరోనా సోకిన భర్త కోసం రెండు నెలల చిన్నారిని వదలి వెళ్లిన భార్య

Update: 2021-05-02 23:30 GMT
కరోనా మొదలైనప్పటి నుంచి తీవ్ర విషాదాల కు అంతే లేకుండా పోతోంది. అప్పటివరకు తమ చెంతే ఉన్న ఎంతో మంది కుటుంబీకులు కరోనా  బారినపడి మృత్యువాత పడుతుండటంతో బాధిత కుటుంబాల్లో  తీవ్ర విషాదం నెలకొంటోంది. మహమ్మారి దెబ్బకు బంధాలు అనుబంధాలు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి. కరోనా సోకి చనిపోతే కొందరు కుటుంబీకులు చివరి చూపుకు కూడా రావడం లేదు. దీంతో ఎవరూ  లేని అనాథల్లా అంత్యక్రియలు జరుపుతున్నారు. కొంత మంది అయితే చనిపోయిన తమ వాళ్లను వీడియో కాల్ ద్వారా మాత్రమే చూస్తూ కాటికి  సాగనంపుతున్నారు.

ప్రముఖ టీవీ నటుడు అనిరుధ్ దవే కొద్దిరోజుల కిందట కరోనా  బారినపడ్డారు. ప్రస్తుతం సీరియస్ కండిషన్ లో  ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనను చూసుకోవడానికి ఆయనకు  భార్య తప్ప మరెవరూ లేరు. అయితే వారికి రెండు నెలల చిన్నారి కూడా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అనిరుధ్ దవే  భార్య శుభి అహుజా తన బిడ్డను ఒంటరిగా వదలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త దగ్గరికి వెళ్ళింది. అత్యంత విషాదకరమైన తన పరిస్థితి పై శుభి అహుజా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఆమె దయ పరిస్థితిపై అందరినీ కలచి వేస్తోంది.

' నా భర్త అనిరుధ్ దవే కరోనా బారిన పడడంతో, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా మారింది. ఆయనను భోపాల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి లో చేర్పించగా ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త కోసం తమ రెండు నెలల చిన్నారిని  ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళాను. అది తన జీవితంలోనే అత్యంత బాధాకరమైన సంఘటన. ఇంట్లో చిన్నారి ని చూసుకోవడానికి ఎవరూ  లేరు. అటు తన భర్తను ఆస్పత్రిలో చూసుకునేందుకు కూడా ఎవరూ లేరు.

ఈ కఠిన పరిస్థితుల్లో తన భర్తను చూసుకునేందుకు పాపను ఇంట్లోనే ఒంటరిగా వదిలి అనిరుధ్  దగ్గరికి వెళ్తున్నాను. నా బిడ్డ, భర్త క్షేమం కోసం అందరూ ప్రార్థించాలని' శుభి అహుజా ఇన్ స్టా గ్రామ్ వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం అందరినీ కలచివేస్తోంది. మీ భర్త,బిడ్డ క్షేమంగా ఉంటారని ధైర్యం కోల్పోవద్దని అహుజా కు అభిమానులు, నెటిజన్లు అండగా నిలిచారు. అనిరుధ్ దవే లాక్ డౌన్ కి లవ్ స్టోరీ, శక్తి అస్తిత్వా కే ఏహాసన్ కీ, బంధన్ తదితర టీవీ షోల పేరు తెచ్చుకున్నారు.
Tags:    

Similar News