రెండంటే రెండు ప్రశ్నలు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందరి నోట వస్తున్న సందేహాలు. నిజానికి ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు కేవలం ఊహాగానాలే తప్పించి.. ఎవరికి నిర్దిష్టమైన సమాచారం ఉంది లేదు. గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా.. ఈ రెండు ప్రశ్నల ప్రస్తావన పక్కాగా రావటం గమనార్హం. ఇంతకూ ఆ రెండు ప్రశ్నలేమంటే.. ఒకటి.. కేసీఆర్ ముందస్తుకు వెళ్లనున్నారా? రెండోది.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తప్పదా? అన్నవే ఆ రెండు ప్రశ్నలు.
ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు ఏమిటన్న దానిపై ఎవరికి వారు అభిప్రాయాలు వెల్లడిస్తున్నా.. వాస్తవం ఏమిటి? అన్న ఉపప్రశ్న వద్ద ముందుకు వెళ్లలేని పరిస్థితి. అయితే.. ఈ ప్రశ్నలకు సంబంధించిన ఊహాగానాలు.. అంచనాలు మాత్రం ఎవరికి వారు పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. ఇందులో మొదటి ప్రశ్నను చూస్తే.. తెలంగాణలో ముందస్తు వచ్చే అవకాశం ఎంత? అన్నది. ఈ విషయానికి వస్తే.. మొన్నటికి మొన్న (ఎమ్మెల్యేల ఎర ఎపిసోడ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో) షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని.. ముందస్తు వచ్చే అవకాశం లేదని కేసీఆర్ స్పష్టం చేయటం తెలిసిందే.
ఆయన నోటి నుంచి అంత స్పష్టంగా సమాధానం వచ్చినప్పటికీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉండనుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు మారిపోతున్న పరిణామాల నేపథ్యంలో ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
లిక్కర్ స్కాంలో తన కుమార్తె కవితను కావాలనే టార్గెట్ చేశారని.. తనను ఇరుకున పడేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రగా తెలంగాణలోని పలువురు భావిస్తున్న వేళ.. ఒకవేళ అరెస్టు కానీ జరిగితే.. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతాయంటున్నారు.
అరెస్టుతో వచ్చే సానుభూతిని సొమ్ము చేసుకోవటంతో పాటు..ఇతర అంశాల్ని పరిగణలోకి తీసుకొని ముందస్తుకు వెళ్లే వీలుందంటున్నారు. వచ్చే ఏప్రిల్.. మేలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో.. వారితో పాటు ఎన్నికలకు వెళితే మేలు జరుగుతుందని.. తమకు రాష్ట్రంలో తిరుగు ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఎపిసోడ్ పైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవిధంగా చూస్తే తెలంగాణ రాజకీయం మొత్తం కూడా ఈ రెండు ప్రశ్నల చుట్టూనే తిరుగుతుందన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.