అయ్య బాబోయ్ ఆ క్రికెటర్లు అంత డర్టీనా.. బూతులు మాట్లాడతారా ... సెహ్వాగ్ చెప్పిన నిజాలివి..!
క్రికెటర్ల లైఫ్ ఇతరులతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. ఆట లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని ప్రాంతాలకు వెళ్తుంటారు. అక్కడి సాంప్రదాయాలను దగ్గరగా గమనిస్తుంటారు. ఇక విదేశాలకు వెళ్లి క్రికెట్ ఆడుతూ ఉంటారు. క్రికెట్ ఆడే అన్ని దేశాల్లోనూ పర్యటిస్తుంటారు. ఇలా అందరి లైఫ్ స్టయిల్ ఎలా ఉంటుందో ఆటగాళ్లు గమనిస్తుంటారు. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాను క్రికెట్ ఆడిన రోజుల్లో ఇతర దేశాల క్రికెటర్లు ఎలా వ్యవహరిస్తుంటారో తాజాగా వెల్లడించాడు. సోనీ టీవీ లో వచ్చే కపిల్ శర్మ షోలో వీరేంద్ర సెహ్వాగ్ పాల్గొని క్రికెటర్లకు సంబంధించిన పలు సీక్రెట్స్ బయట పెట్టాడు.
ప్రపంచంలోనే ఇంగ్లాండ్ క్రికెటర్లంతా డర్టీగా మరెవరూ ఉండరని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. వాళ్లు అసలు రోజూ స్నానం కూడా చేయరట. అయితే ఆ దేశంలో చలి వాతావరణమే ఇందుకు కారణం అయి ఉండొచ్చు అని చెప్పాడు. ఇక పాకిస్థాన్ క్రికెటర్లు తిట్టుకున్నట్లు మరెవరూ తిట్టుకోరని సెహ్వాగ్ వెల్లడించాడు. మైదానంలో ఉన్నంతసేపు వాళ్లు తిట్టుకుంటూనే ఉంటారని, మ్యాచ్ ముగిసే దాకా ఆ తిట్లను భరిస్తూ వినాల్సి వస్తుందని అన్నాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్లకైతే అమ్మాయిల పిచ్చి ఎక్కువ అని, వారికోసం ఆటగాళ్లు జైలుపాలైన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పాడు. శ్రీలంక క్రికెటర్లు మ్యాచ్ ఆడే సమయంలో గానీ తర్వాత గానీ పెద్దగా మాట్లాడారని సెహ్వాగ్ చెప్పాడు. అయితే దీనికి అసలు కారణం... వారికి బొత్తిగా ఇంగ్లీషు రాక పోవడమే కారణమని వెల్లడించాడు.
ఇక వెస్టిండీస్ క్రికెటర్లకు ఉన్నంత పార్టీల పిచ్చి మరెవరికీ ఉండదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఆ దేశస్తులు ఎక్కువగా రాత్రంతా తాగుతూ మేల్కొని పగటిపూట నిద్ర పోతూ ఉంటారని చెప్పాడు. ఓ సారి యువరాజ్ సింగ్ 'యూవీ కెన్' జెర్సీ లాంచింగ్ కు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ వచ్చాడని, కార్యక్రమం అయిపోయిన తర్వాత పార్టీలో మందు తాగుతూ తెల్లారే వరకు గడిపాడని చెప్పుకొచ్చాడు. అయితే వెస్టిండీస్ ప్రజలు ఇతరులకు సంబంధించిన విషయాలను పెద్దగా పట్టించుకోరని చాలా మంచివారని వీరేంద్ర సెహ్వాగ్ కితాబిచ్చాడు.