చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి గత రెండున్నరేళ్లుగా ప్రజలను పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. ప్రపంచంలో చాలా సంస్థలు ఈ విధంగా పని చేయించుకోవడానికే మొగ్గు చూపించాయి. చాలా తక్కువ సంస్థలు మాత్రమే.. అంటే అత్యవసర సేవలు ఉండే కంపెనీలు తప్ప మిగతావన్నీ వీలైనంత వరకు ఇంటి నుంచి పని చేసే విధానానికి వీలు కల్పించాయి.
దీనిలో భాగంగానే మన దేశంలో కొవిడ్ వ్యాప్తి చెందిన నాటి నుంచి చాలా సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ నే బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగం అయితే దీని మీదే డిపెండ్ అయింది. చాలా మంది ఉద్యోగులు కూడా దీనికే మొగ్గు చూపించారు. దీంతో వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో పాటు ఉద్యోగులకు కావాల్సి సౌకర్యాలను కూడా కల్పించాయి ఆయా సాఫ్ట్ వేర్ సంస్థలు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం కారణంగా దేశీయ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీస్ నుంచి పని చేయించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నాయి.
గత కొద్ది రోజులుగా వివిధ రాష్ట్రాల్లో కొవిడ్ మూడవ వేవ్ ప్రభావం చాలా తగ్గింది. దీంతో తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలవాలని ఐటీ కంపెనీలు చూస్తున్నాయి. ఇది ఉద్యోగులకు చేదు వార్తగా ఉన్న కానీ ఇది నిజం. ముఖ్యంగా దేశీయ కంపెనీల అయిన విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్ లు వర్క్ ఫ్రం హోం ఎత్తి వేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీలు అధికారికంగా బయటపెట్టనప్పటికీ... ఈ దిశగానే అడుగులు వేస్తున్నాయని టెక్ నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న పరిస్థిల్లో ఉద్యోగులను ఆఫీసులు పిలవడం ఒకింత రిస్క్ తో కూడిన విషయం అయినా కానీ కంపెనీలు మాత్రం ఈ విషయంలో వెనకడు వేసేలా లేవని వినికిడి.
విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు అయితే ఇప్పటికే ఓ స్థాయి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం పై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కొన్ని బెంగళూరుకు చెందిన కంపెనీలు వారి సంస్థల్లో ఉండే మేనేజర్స్, టీం లీడ్ ఉద్యోగులు తిరిగి ఆఫీసుకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. ముఖ్యంగా విప్రో ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. సంస్థ పెద్దలు అనుకున్నది అమలు చేస్తే.. దాని ప్రకారం మార్చి 3లోగా ఈ స్థాయి ఉద్యోగులు అందరూ వర్క ఫ్రం హోం కు పుల్ స్టాప్ పెట్టాల్సి రావచ్చు. ఇదిలా ఉంటే మరి కొందరిని కేవలం వారంలో రెండు రోజులు మాత్రమే ఆఫీసుకు రావాల్సి ఉంటుందని చెప్పాయి. అన్నీ బాగుంటే ఏప్రిల్ మొదటి వారంలో ఉద్యోగులు అందరూ కూడా ఆఫీసుల నుంచి పని చేయాల్సి ఉంటుంది.
మరో ప్రముఖ కంపెనీ అయిన కాగ్నిజెంట్ కూడా వర్క్ ఫ్రం హోం విషయం లో గట్టిగానే ఉంది. ఏప్రిల్ చివరకు ఆఫీసు నుంచి కార్యకలాపాలు కొనసాగించనుంది. కానీ పక్షంలో ఇప్పటికే ఉన్న హైబ్రిడ్ వర్క్ మోడల్ ను ఫాలో కానుంది. టీసీఎస్ అయితే రిమోట్ వర్కింగ్ పాలసీని తీసుకువచ్చింది. దీంతో ఉద్యోగులు కచ్చితంగా ఏర్పాటు చేసిన లొకేషన్ నుంచే పని చేయాల్సి ఉంటుంది. మరో వైపు 25/25 మందిని ఆఫీసుకు పిలిచే యోచన కూడా ఉందని తెలుస్తోంది.
ఈ వర్క్ ఫ్రం హోం తీసివేసేందుకు ప్రధాన కారణం దేశంలో పాజిటివిటీ రేటు బాగా తగ్గడమే. దీంతో ఉద్యోగులను ఆఫీస్ నుంచి పని చేయించడానికి ముందుకు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఉద్యోగులను ఆఫీస్ కు పిలవాలని భావించినా దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ ఆందోళనతో వెనకడుగు వేశాయి. నేడు ఆ పరిస్థితి లేదు. వ్యాప్తి కూడా తక్కువ ఉండడంతో సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. అందుకే వర్క్ ఫ్రం హోంకు ముగింపు పలకాలని చూస్తున్నాయి.