75 ప‌థ‌కాల‌కు ఆ పేర్లున్నా స‌రిపోలేదా?

Update: 2022-09-22 08:24 GMT
విజ‌య‌వాడ‌లో ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మార్పు వ్య‌వ‌హారం ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. ఎన్టీఆర్ పేరును తొల‌గించి వైఎస్సార్ హెల్త్ యూనివ‌ర్సిటీగా మార్చ‌డంపై ప్ర‌తిప‌క్ష పార్టీలు, వివిధ సంఘాలు, త‌ట‌స్థ వ్య‌క్తులు జ‌గ‌న్ నిర్ణ‌యింపై దుమ్మెత్తిపోస్తున్నారు.

స్వ‌యంగా జ‌గ‌న్ పార్టీలోనే ఉన్న అధికార భాషా సంఘం అధ్య‌క్షుడు యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీప్ర‌సాద్‌, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్టారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ యార్ల‌గ‌డ్డ త‌న ప‌దవికి ఇప్ప‌టికే రాజీనామా చేశారు.

కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టికే 75 ప‌థ‌కాల‌కు వైఎస్సార్‌, జ‌గ‌న్ పేర్లు ఉన్నాయ‌ని గుర్తు చేస్తున్నారు. ఇన్ని పేర్లున్నా జ‌గ‌న్‌కు కుతి తీర‌లేదా అని నిల‌దీస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వాల ప‌థ‌కాల పేర్లు కూడా మార్చేసి త‌న తండ్రి, త‌న పేర్లు జగ‌న్ పెట్టుకున్నార‌ని ధ్వ‌జ‌మెత్తుతున్నారు. జ‌గ‌న్‌కు ఉన్న‌టువంటి ప్ర‌చార కండూతీ ఎవ‌రికీ లేద‌ని నిప్పులు చెరుగుతున్నారు.

ఇప్ప‌టికే జ‌గ‌న‌న్న అమ్మ ఒడి, జ‌గ‌నన్న విద్యా కానుక‌, జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌, జ‌గ‌నన్న విద్యా వ‌స‌తి, జ‌గ‌న‌న్న విదేశీ విద్యా దీవెన‌, జ‌గ‌న‌న్న గోరుముద్ద‌, జ‌గ‌న‌న్న కాల‌నీలు, జ‌గ‌న‌న్న చేదోడు, జ‌గ‌న‌న్న పెళ్లికానుక‌, జ‌గ‌న‌న్న తోడు, జ‌గ‌న‌న్న పాల‌వెల్లువ‌, వైఎస్సార్ చేయూత‌, వైఎస్సార్ ఆస‌రా, వైఎస్సార్ వాహ‌న‌మిత్ర‌, వైఎస్సార్ మ‌త్స్య‌కార భ‌రోసా, వైఎస్సార్ రైతు భ‌రోసా, వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ, వైఎస్సార్ జ‌ల‌య‌జ్ఞం, వైఎస్సార్ జ‌ల‌క‌ళ‌, వైఎస్సార్ పెన్ష‌న్ కానుక‌, వైఎస్సార్ ఆరోగ్య ఆస‌రా, వైఎస్సార్ న‌వోద‌యం, వైఎస్సార్ ఆద‌ర్శం, వైఎస్సార్ బీమా, వైఎస్సార్ ఉచిత‌ పంట‌ల బీమా, వైఎస్సార్ కంటివెలుగు, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ నేత‌న్న నేస్తం, వైఎస్సార్ లా నేస్తం, వైఎస్సార్ సంపూర్ణ పోష‌ణ‌, వైఎస్సార్ సంపూర్ణ పోష‌ణ ప్ల‌స్, వైఎస్సార్ సున్నావ‌డ్డీ, వైఎస్సార్ రైస్ కార్డు, వైఎస్సార్ న‌వ‌శ‌కం, వైఎస్సార్ తొమ్మిది గంట‌ల ఉచిత విద్యుత్, వైఎస్సార్ బడుగు వికాసం, వైఎస్సార్ అగ్రిల్యాబ్స్, వైఎస్సార్ ఆరోగ్య ర‌క్ష‌, వైఎస్సార్ ఈబీసీ నేస్తం త‌దిత‌రాలు క‌లిపి మొత్తం 75 ప‌థ‌కాల‌కు వైఎస్సార్, జ‌గ‌న్ పేర్లు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు.

ఇవి చాల‌వ‌న్న‌ట్టు ఇప్ప‌టికే ఒక జిల్లాకు వైఎస్సార్ పేరు ఉంద‌ని చెబుతున్నారు. అలాగే తాడేప‌ల్లిగూడెంలోని ఉద్యాన విశ్వ‌విద్యాల‌యానికి, క‌డ‌ప‌లో ఉన్న ఆర్కిటెక్చ‌ర్ అండ్ ఫైనార్ట్స్ యూనివ‌ర్సిటీకి కూడా వైఎస్సార్ పేర్లు ఉన్నాయ‌ని అంటున్నారు.

ఇవి చాల‌వ‌న్న‌ట్టు దాదాపు 25 ఏళ్ల నుంచి ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్ట‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. ఇంత ప్ర‌చార కండూతీ అయితే ఎలా జ‌గ‌న్ అని నెటిజ‌న్లు సైతం నిల‌దీస్తున్నారు.
Tags:    

Similar News