ఇటీవల జరిగిన గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ రోజు (గురువారం) ఫలితాలు వెల్లడి కానున్న వేళ.. దీనికి ఒక రోజు ముందుగా విడుదలైన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని ఎవరూ అనుకున్నది లేదు.అయితే.. ఈ ఎన్నికల్లో తమకు విజయం ఖాయమన్న దీమాను కమలనాథులు వ్యక్తం చేసినప్పటికీ.. వాస్తవం అందుకు భిన్నమన్న విషయాన్ని తుది ఫలితాలు చెప్పేశాయి.
చాలామంది విశ్లేషకుల విశ్లేషణ ప్రకారం ఢిల్లీలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలిందన్న మాటలో అర్థం లేదంటున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అధికార పక్షంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన సత్తాను చాటగా.. బీజేపీ సైతం తానేం తక్కువ కాదన్న విషయాన్ని చెప్పకనే చెప్పిందని చెప్పాలి. మొత్తం 250 వార్డులు ఉన్న ఢిల్లీ కార్పొరేషన్ లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 132 వార్డుల్లోనే విజయం సాధించింది. అంటే.. తన గెలుపునకు అవసరమైన దాని కంటే కేవలం ఆరు స్థానాలే ఎక్కువ.
అదే సమయంలో బీజేపీ 104 స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం తొమ్మిది స్థానాలతో సరిపెట్టుకుంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ కు సింగిల్ డిజిట్ ను దాటకపోవటం చూస్తే.. ఆ పార్టీ ఎంతటి దయనీయ స్థితిలో ఉందో అర్థమవుతుంది. ఢిల్లీ ఫలితాల్ని చూస్తే.. ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా బీజేపీ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించినట్లుగా అర్థమవుతుంది.
ఈ ఎన్నికల ప్రభావం లోక్ సభ ఎన్నికల మీద ఉంటుందనటంలో అర్థం లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండటం ఒక కారణమైతే.. అప్పటికి జాతీయ ప్రయోజనాలే ఎన్నికల ఎజెండాగా మారతాయన్నది మర్చిపోకూడదు.
నిజానికి బీజేపీ చేసిన మూడు తప్పిదాలు ఆ పార్టీకి విజయాన్ని సాధించే అవకాశాన్ని కోల్పోయేలా చేసిందని చెబుతున్నారు. ఆ మూడు తప్పిదాలు జరగకుంటే పరిస్థితి మరోలా ఉందంటున్నారు. ఇంతకూ ఆ మూడు తప్పిదాలు ఏమిటన్నది చూస్తే..
1. బూత్ మేనేజ్ మెంట్ దయనీయంగా ఉండటమని చెబుతున్నారు. ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లకు ఓట్ల స్లిప్పులను ఇంటింటికి చేరవేయటంలో విజయం సాధిస్తే.. బీజేపీకి చెందిన ఏ ఒక్క నేత కూడా ఈ విషయాన్ని ఫోకస్ చేయలేదంటున్నారు. దీంతో.. తీవ్ర ప్రభావాన్ని చూపినట్లుగా చెబుతున్నారు.
2. అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు జరిగినట్లుగా చెబుతున్నారు. సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేసి వారికి పార్టీ టికెట్లు ఇవ్వాల్సి ఉన్నా.. ఆ విషయంలో భారీగా తప్పులు చోటు చేసుకున్నట్లుగా విశ్లేషిస్తున్నారు.
3. ఈ ఎన్నిక మొత్తాన్ని ఏ ఒక్క నేత బాధ్యతగా తీసుకోపోవటం. అందరిని కలుపుకు వెళ్లే నాయకత్వ లోపం కూడా తాజా ఫలితానికి కారణమంటున్నారు. ప్రతి స్థాయిలోనూ అధికార కేంద్రాలు.. గ్రూపులుచురుగ్గా పని చేశాయంటున్నారు. జవాబుదారీగా వ్యవహరించేనేతలు ఉండి ఉంటే.. పలితాలు ఈ మాదిరి ఉండేవి కావన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.