రెండు తెలుగు రాష్ట్రాలకూ పెద్ది దిక్కుగా అటు స్వరూపానందేంద్ర,ఇటు చిన జియరు స్వామి నిలుస్తున్నారు.ముచ్చింతల్ వేదికగా జరుగుతున్న వేడుకలకు అటు ఆంధ్రా నుంచి ఇటు తెలంగాణ నుంచి నాయకులు విచ్చేసేందుకు కారణం ఇదే! అయితే వైవీ లాంటి పెద్దలు, చెవిరెడ్డిలాంటి పెద్దలు అక్కడే ఉండిపోయి తమ ప్రాధాన్యం పెంచుకునే క్రమంలో విలువైన కాలాన్ని వెచ్చిస్తున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి.ఆ విధంగాముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేద్దామన్న అన్న తాపత్రయమా?
ఏమో కానీ..రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖులూ ఇవాళ వెయ్యికోట్ల ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.సనాతన ధర్మ స్థాపనే తమ ధ్యేయం అని పునరుద్ఘాటిస్తున్నారు.మంచిదే ఇదే సమయంలో కాల గర్భంలో కలిసి పోయేందుకు సిద్ధంగా ఉన్న వేల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న ఆలయాలను జీర్ణోద్ధరణ పేరిట ఆదుకుంటే ఎంతోమేలు అన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఇక వైవీ ఎప్పటి నుంచి రాజ్యసభకు పోవాలని అనుకుంటున్నారు కానీ కుదరడం లేదు.చెవిరెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు కానీ దక్కడం లేదు.ఏం దక్కినా దక్కకున్నా జగన్ ఇవాళ హిందూమత విశ్వాసాలకు ఆనవాలుగా నిలుస్తున్నారు అన్న అభిప్రాయాన్ని బలీయంగా ఆంధ్రాలోనూ తెలంగాణలోనూ తీసుకువెళ్లేందుకు ఈ ఇద్దరూ బాగానే కృషి చేస్తున్నారు. అందుకు తగ్గ ప్రతి సందర్భాన్నీ బాగానే వినియోగించుకుంటున్నారు.ఇక జగన్ విశ్వాసాలను ప్రశ్నించే వారికి విమర్శించే తావే లేకుండా చేస్తున్నారు.
శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరైన జగన్ మొన్నటి వేళ చెప్పాలనుకున్నదీ ఇదే! ముచ్చింతల్ కు వెళ్లి తిరునామం ధరించి
చెప్పాలనుకుంటున్నదీ ఇదే! కనుక ఈ రెండింటిలోనూ వెన్నుతట్టి నడిపిస్తోంది వైవీనే అన్నది అక్షర సత్యం.ఆ విషయం జియరు
స్వామి కూడా చెప్పారు.కనుక బాబాయ్ అడుగుల్లో జగన్ నడుస్తున్నారు కానీ బాబాయ్ కోరికలను మాత్రం నెరవేర్చడంలో ఈ సారి కూడా ప్రాధాన్యం ఎందుకనో ఇవ్వడం లేదు?