ఏపీలో కొందరి టీడీపీ నేతల కోర్కెలను తీర్చడంలో పార్టీ అధినేత నిర్లక్ష్యం వహిస్తుండడంతో వారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మొన్నటి వరకు కొందరు టీడీపీ నాయకులు వైసీపీ వైపు నడిచారు. మరికొంతమంది కూడా ఆఫర్స్ అనుకూలంగా ఉంటే టీడీపీని వీడడానికి సిద్ధమవుతున్నారు. టీడీపీలో జరుగుతున్న పరిణామాలను గ్రహిస్తూ.. ఆ పార్టీలోని అసంతృప్త నేతలను తమ పార్టీ లోకి లాగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా కాకినాడ ఎంపి తోట నరసింహం టీడీపీలో అసంతృప్తితో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.. ఈ సందర్భంగా ఆయనను వైసీపీ, జనసేన పార్టీ నాయకులు కలిసి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
కాకినాడు నుంచి గత ఎన్నికల్లో ఎంపీగా తోట నరసింహం గెలుపొందారు. ఆనారోగ్యరీత్యా ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని ప్రకటించారు. అయితే తన సతీమణికి గానీ, కుమారుడికి గానీ జగ్గంపేట అసెంబ్లీ సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. కానీ ఈ స్థానంలో జ్యోతుల నెహ్రూ ఉండడంతో తోటకు బాబు ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో ఆయన ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నట్లు ఆనోట ఈ నోటా ప్రతిపక్షాల చెవున పడింది.
ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆయనను కలుసుకున్నారు. ఆరోగ్య బాగోగులు తెలుసుకున్నారు. అలాగే జనసేన పార్టీ నాయకులు కూడా తోట నరసింహంను కలిసి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకులు బ్రహ్మదేవ్, పంతం నానాజి, తులసీరామ్ లు తోటను కలిసిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ మీ కుటుంబ సభ్యులు ఎక్కడ పోటీ చేసినా తమ పార్టీ నుంచి సీటు కన్ఫామ్ అని వారు తోట నరసింహంకు హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక ఓట్లు ఎక్కువ. ఆ సామాజిక వర్గానికే చెందిన తోట నరసింహంను తమ పార్టీలో చేర్చుకుంటే లాభిస్తుందని జనసేన సైనికులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తోట ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురుచూస్తున్నారు.