చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మరోసారి విజృంభించేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తుంది. గతంలో డెల్టా వేరియంట్ పేరుతో మరణ మృదంగం మార్మోగింది. నేడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా అదే బాటలో పడుతుంది. కేవలం రోజుల వ్యవధిలోనే ఈ వైరస్ సోకిన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది.
ఇటీవల బ్రిటన్ లో ఈ వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఇవి వెలుగు చూసిన కొద్ది రోజుల్లోనే ఒక్క సారిగా కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. మరో వైపు మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.
యూకేలో వెలుగుచూసిన ఒమిక్రాన్ కొత్త కేసులు ప్రపంచాన్నంతటినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేవలం ఇరవై నాలుగు గంటల్లో సుమారు 10 వేల కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కలవరపాటుకు గురౌతున్నారు. మరోవైపు వైరస్ కు సంబంధించిన కేసులు మాత్రమే కాకుండా మరణాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఈ కొద్ది రోజుల్లోనే ఏడు మరణాలు నమోదైనట్లు బ్రిటన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే కొత్త వేరియంట్ గడిచిన నాలుగు రోజుల్లోనే కేసు లోడ్ ను భారీగా పెంచింది. సుమారు మూడు రెట్లకు పైగా కేసుల సంఖ్య పెరిగింది. కొత్త కేసులతో వైరస్ బారిన పడిన వారి సంఖ్య తాజాగా 24, 968 కు చేరినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోవైపు బ్రిటన్ లో సాధారణ కరోనా కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. కేవలం 24 గంటల్లో 90 వేల పై చిలుకు కేసులు నమోదైనట్లు బ్రిటన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే పెరుగుతున్న కేసులు దృష్టిలో ఉంచుకొని వ్యాక్సినేషన్ కూడా పూర్తిస్థాయిలో కంప్లీట్ చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
ఇందుకు తగిన విధంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన డబ్ల్యు హెచ్ ఓ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.
మరోవైపు ఒమిక్రాన్ కేసులు భారీగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో బ్రిటన్ లో ఆంక్షలను మరింత కఠినతరం చేశారు అధికారులు. లాక్ డౌన్ ను త్వరలోనే విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
త్వరలో రానున్న క్రిస్మస్ పండుగ దృష్టిలో ఉంచుకొని దేశ ప్రజలు వేడుకల్లో భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 27 తర్వాత లాక్ డౌన్ కు సంబంధించి పూర్తి స్థాయి నిర్ణయాన్ని బ్రిటన్ ప్రధాని తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు.