ఏపీలో అభివృద్ధి గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది! ఈ మాట ఎవరో ప్రతిపక్ష నాయకులు సీఎం జగన్‌పై అక్కసుతో చెప్పింది కాదు.. తాజాగా రెండు రోజుల కిందట ఐటీ పెట్టుబడులు.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబందించి శుక్రవారం పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పుకొచ్చింది. దీనిని కూడా తప్పుపట్టే వైసీపీ నాయకులు ఉన్నారను కోండి.. అది వేరే సంగతి.
ఇక, ఇప్పుడు వైసీపీ నాయకులు జబ్బలు చరుచుకుని, చంకలు గుద్దుకుని.. తమ పాలనలో పెట్టుబడులు వస్తున్నాయంటూ.. ఒక విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. అదేంటంటే.. పాలనా రాజధానిని చేస్తామని వైసీపీ పెద్దలు చెబుతున్న విశాఖ నగరానికి మల్టీనేషనల్ కంపెనీ అమెజాన్ పెట్టుబడితో వచ్చింది. సుమారు రూ.185 కోట్ల రూపాలయతో ఇక్కడ అమెజాన్ సంస్థ డెవలప్మెంట్ ఫెసిలిటీ సెంటర్ ని ఏర్పాటు చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. మంచిదే.. మూడున్నరేళ్ల తర్వాత.. విశాఖకు వచ్చిన కంపెనీగా దీనిని వాడుకోవడం తప్పు కాదు. ఇక, ఈ సంస్థ రాకతో.. 2023లో విశాఖలో అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం అవుతుంది. కాబట్టి.. ఇక్కడ వైసీపీ అంతో ఇంతో తలెత్తుకునేందుకు అవకాశం ఏర్పడింది.
కానీ..ఇక్కడ ప్రధాన చిక్కు ఏంటంటే..టీడీపీ హయాంలో ఒప్పందాలు చేసుకున్న మూడు దిగ్గజ కంపెనీలు.. అప్పటికే కేంద్రాలను ఏర్పాటు చేసిన కంపెనీలు.. వైసీపీ హయాంలోనే ఇక్కడ ఉండలేం అంటూ.. తరలిపోయాయి. వీటిలో లూలూ కంపెనీ కూడా ఒకటి. ఇది ఏకంగా 3 వేల పైచిలుకు కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది. అయితే.. వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిపోయింది. అంటే.. దీనిని బట్టి.. వేల కోట్లు పోయి.. అమెజాన్ వంద కోట్లు రావడమే!! ఇదీ.. సంగతి!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.