‘‘చాటలో తవుడు పోసి.. కుక్కల మధ్య కొట్లాట పెట్టారు’’ అనేది పురాతన సామెత. ఈ ఫొటో అలాంటిదే. వీరంతా కొవిడ్ ట్రీట్మెంట్లో కీలకమైన రెమ్ డెసివర్ ఇంజక్షన్ కోసం బారులు తీరిన వారు. ఇందులో అర్ధరాత్రి 1 గంట నుంచి లైన్లో నిల్చున్నవారు ఉన్నారట. వారం నుంచి ఇంజక్షన్ కోసం వచ్చిపోతున్నవారు ఉన్నారట. మిగిలిన వారిలో మెజారిటీ జనం రెండు మూడు రోజులుగా తిరుగుతున్నవారేనట. అందుకే.. సహనం నశించింది. నిబంధనలు గాలికి కొట్టుకుపోయాయి.
కరోనా చెలరేగిపోతున్న వేళ లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. వేలాది మందికి రెమ్ డెసివర్ ఇంజక్షన్ల అవసరం పడుతోంది. ఒక్క రోగికి ఆరు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఊపిరి సరిగా అందని వారికి ఈ మందును రిఫర్ చేస్తారు వైద్యులు. కానీ.. కేంద్రం నుంచి సరిగా సరఫరా కావట్లేదు. దీంతో.. వచ్చిన కొద్దిపాటి మందును దక్కించుకునేందుకు కొవిడ్ బాధితుల బంధువులు ఇలా నానాఅవస్థలు పడుతున్నారు.
ఈ పరిస్థితి తమిళనాడులోనిది. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో వీళ్లంతా ఇంజక్షన్ల కోసం బారులు తీరారు. నిత్యం 20 వేలకు పైగా ఇంజక్షన్లు అవసరమైన చోట.. రోజుకు 7 వేలు మాత్రం అందుబాటులో ఉన్నట్టు సమాచారం. దీంతో.. అవి ఏ మూలకూ సరిపోవట్లేదని తెలుస్తోంది. ఫలితంగా.. తమ వారిని కాపాడుకునేందుకు జనం నిబంధనలను పక్కనపెట్టి మరీ ఇలా తోసుకుంటున్నారు.
ఇది చూసిన వారంతా.. వీళ్లు తమ వారిని కాపాడుకోవడం ఏమోగానీ.. వీరికి కరోనా సోకడం గ్యారంటీగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.