బ్రిట‌న్ చేరిన క‌శ్మీర్ ర‌గ‌డ‌.. భారీ ఎత్తున ఆందోళ‌న‌లు

Update: 2019-08-17 11:33 GMT
భార‌త్‌ కు చెందిన క‌శ్మీర్ వివాదం ఇప్పుడు అతి పెద్ద ఆర్ధిక దేశం.. లండ‌న్ కు చేరింది. క‌శ్మీర్ విష‌యంపై బ్రిట‌న్ రాజ‌ధాని లండ‌న్ లో ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి(యూఎన్ ఎస్ సీ) శుక్ర‌వారం చ‌ర్చించింది. అయితే, త‌లుపులు మూసేసి సాగిన ఈ చ‌ర్చ‌ను తెలుసుకున్న క‌శ్మీర్‌ కు చెందిన యువ‌త పెద్ద ఎత్తున లండ‌న్‌ లోని భార‌త హైక‌మిష‌న్ కార్యాల‌యానికి చేరుకుని భారీ నిర‌స‌న‌కు దిగింది. క‌శ్మీర్ విష‌యంలో జోక్యం వ‌ద్ద‌ని నిన‌దిస్తూ.. ప్ల‌కార్డులు చేత‌బూని.. నినాదాలు చేశారు.  

జ‌మ్ము క‌శ్మీర్ స్వతంత్రానికి, అక్క‌డి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌పై భార‌త ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతోంద‌ని ఆరోపిస్తూ.. లండ‌న్‌ లో యువ‌త పెద్ద ఎత్తున ఉద్య‌మానికి దిగింది. ల‌క్ష‌ల సంఖ్య‌లో క‌శ్మీరీల‌ను ప్ర‌భుత్వం గృహ నిర్బంధంచేసింద‌ని, క‌నీసం స‌మాచారం తెలుసుకునేందుకు కూడా సంకెళ్లు వేసింద‌ని ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే ఐక్య‌రాజ్య‌స‌మితికి ఓ విన్న‌పం చేశారు. జ‌మ్ము క‌శ్మీర్‌ ను విడ‌గొట్ట‌డం స‌హా.. కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్ర‌క‌టించుకోవ‌డాన్ని వెన‌క్కి తీసుకునేలా భార‌త ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావాల‌ని యువ‌త పెద్ద సంఖ్యలో నిన‌దిస్తూ.. యూఎన్‌ కు విన్న‌పాలు చేశారు.  

``నేను క‌శ్మీర్‌ లోని మా బంధువుల‌తోనూ, నా కుటుంబ స‌భ్యుల‌తోనూ మాట్లాడేందుకు కూడా అవ‌కాశం లేకుండా పోయింది. గ‌డిచిన 12 రోజులుగా అక్క‌డి ప్ర‌జ‌లు న‌ర‌కం చూస్తున్నారు. భార‌త ప్ర‌భుత్వం కేవ‌లం క‌శ్మీర్‌ ను నిర్బంధం కాదు.. అక్క‌డి ప్ర‌జ‌ల‌పై క‌ర్ఫ్యూ విధించింది ఇది అమానుషం. మా త‌ల్లిదండ్రుల ప‌రిస్థితి ఎలా ఉందో కూడా తెలియ‌డం లేదు. వారికి క‌నీసం ఆహారం, మందులు వంటివి అందుతున్నాయో లేదో కూడా ఆందోళ‌న‌గా ఉంది. ఈ ప‌రిస్థితి అత్యంత భ‌యాన‌కంగా ఉంది. అంద‌రినీ ఆవేద‌న‌కు, బాధ‌కు, ఆగ్ర‌హానికి కూడా గురిచేస్తోంది`` అని ఆందోళ‌న‌కు నేతృత్వం వ‌హించిన ఓ యువ‌తి త‌న ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కింది.

మొత్తానికి ఈ ప‌రిస్థితితో లండ‌న్ వీధుల్లో క‌శ్మీర్ యువ‌త క‌దం తొక్క‌డం పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. మ‌రి దీనిపై భార‌త్ ఎలా స్పందిస్తుందో.? ఐక్య‌రాజ్య‌స‌మితి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. ఇక ఇదే విష‌యంపై డ్రాగ‌న్ దేశం పాక్‌ కు స‌పోర్ట్ చేస్తుంటే మ‌న మిత్ర‌దేశం ర‌ష్యా మ‌న‌కు పూర్తి మ‌ద్ద‌తుగా నిలిచిన సంగ‌తి తెలిసిందే.
    

Tags:    

Similar News