ప్రపంచంలో ఏ దేశంలోనైనా అశాంతి జరిగినా.. ఉగ్రవాద దాడులు జరుగుతున్నా.. ఇతర ముప్పు కనిపించినా ఆ దేశానికి వెళ్లినప్పుడు జాగ్రత్త అంటూ ఇతర దేశాలు తమ పౌరులను హెచ్చరిస్తుంటాయి. ఇలాంటి విషయాల్లో అమెరికా ముందుటుంది. కానీ.. అమెరికా వెళ్లేటప్పుడు జాగ్రత్త అంటూ ఏ దేశమూ ఇంతవరకు తన పౌరులను హెచ్చరించలేదు. తొలిసారిగా ఇప్పుడు మూడు దేశాలు ఆ పనిచేయడంతో అమెరికా ‘‘అయ్యో.. పరువు పోయిందే’’ అని తలపట్టుకుంటోందట. అమెరికాలోని ప్రస్తుతం ఏర్పడిన కల్లోల పరిస్థితులే తాజా హెచ్చరికలకు కారణమయ్యాయి.
అమెరికాలో పర్యటనకు వెళుతుంటే జాగ్రత్తగా ఉండాలని బెహరైన్ - బహమాస్ - యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ జాతీయులను హెచ్చరించాయి. అమెరికాపై ఇలా మూడు దేశాలు హెచ్చరించడం ఇదే మొదటిసారి. అమెరికాలో జాతి విధ్వేషాలు పెరగడం - నల్లజాతి వారిపై వరుస కాల్పుల ఘటనలే ఇందుకు కారణమని తెలుస్తోంది. మధ్య ప్రాచ్యంలో ద్వీపదేశం బెహరైన్ - తన పౌరులు అమెరికాకు వెళితే - జాగ్రత్తగా ఉండాలని - గొడవలు - అధిక జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది. ఇదే సమయంలో కరేబియన్ దేశంగా ఉన్న బహమాస్ సైతం ఇదే హెచ్చరికలు విడుదల చేసింది.
అమెరికాలో కొద్దికాలంగా నల్ల జాతీయులను పోలీసులు హతమారుస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత బుధవారం జరిగిన ఇలాంటి ఘటనకు నిరసనగా నల్లజాతీయులు ఆందోళనలకు దిగారు. డాలస్ లో జరిగిన అల్లర్లలో ఏకంగా అయిదుగురు పోలీసులను హతమార్చారు కూడా. ఈ నేపథ్యంలో అమెరికాలో జాతుల వివక్ష మరింత ముదిరినట్లుగా కనిపిస్తోంది. దీంతో ఈ దేశాలన్నీ తమ పౌరులను హెచ్చరించడమే కాకుండా ముఖ్యంగా నల్లజాతి పురుషులు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సైతం తమ పౌరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అమెరికాలో పర్యటిస్తుంటే సంప్రదాయ దుస్తులను వీడి అమెరికాకు సరిపడే దుస్తులు ధరించాలని సూచించింది.