తాజాగా అమెరికన్ థింక్ ట్యాంక్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషగా తెలుగు నిలవడం విశేషంగా చెప్పవచ్చు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ లైన్ వీడియో ప్రకారం తెలుగు మాట్లాడేవారి సంఖ్య అమెరికాలో 86శాతం పెరిగింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ సెంటర్ అధ్యయనం చేసి అమెరికాలో జనాభా గణన ఆధారంగా తెలుగు మాట్లాడేవారి సంఖ్యను తేల్చింది.
కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు టాప్ 20లో లేదు. అదే భారత్ లో టాప్ 4వ స్థానంలో ఉన్నట్టు ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ నిగ్గుతేల్చింది.
గత ఏడాది అమెరికాలో 4 లక్షల కంటే ఎక్కువమంది తెలుగు మాట్లాడేవారున్నారు. అమెరికాలో టాప్ 10 అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వారిలో ఏడుగురు దక్షిణాసియా నుంచి వచ్చిన వారు ఉన్నారు.
తెలుగు పీపుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రసాద్ కునిస్తి మాట్లాడుతూ హైదరాబాద్ - అమెరికా ఇంజనీరింగ్ - టెక్నాలజీ పరిశ్రమల మధ్య సంబంధాలు బలపడ్డాయని..అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి యువత ఉపాధి కోసం అమెరికా వెళ్తోందని చెప్పుకొచ్చారు. 1990లో అమెరికాలో ఐటీ వేగంగా వృద్ధి చెందినప్పుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు భారీ డిమాండ్ ఏర్పడిందని.. అనేకమంది హైదరాబాద్ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడ్డారన్నారు.. మైక్రోసాఫ్ సత్యనాదెళ్ల - మిస్ అమెరికా నినా దేవులూరి అలా స్థిరపడ్డవారేనని తెలిపారు. ఇప్పటికే ఇక్కడి విద్యార్తులను అమెరికా పెద్దసంఖ్యలో ఆహ్వానిస్తోందని తెలిపారు. .
అమెరికాలో ఉన్న మొత్తం 320 మిలియన్ల జనాభాలో దాదాపు 60 మిలియన్ల మంది ఇంగ్లీష్ కాకుండా వేరే భాషలు మాట్లాడుతున్నట్టు తేలింది. విదేశీ భాషల్లో అత్యధికంగా స్పానిష్ మాట్లాడే ప్రజలు అమెరికాలో ఎక్కువగా ఉన్నారు. ఇక ఎక్కువగా మాట్లాడే దక్షిణాది భాషల విషయానికి వస్తే మొదట హిందీ, తర్వాత ఉర్దూ - గుజరాతీ - తెలుగు వరుసస్థానాల్లో ఉన్నాయి.