ఇది చదివినంతనే ఒళ్లు మండుతుంది. ఆమెకు జరిగిన అన్యాయం వింటే రక్తం సలసలా కాగుతుంది. ఏదో ఒకటి చేయాలన్నంత కోపం వస్తుంది. ఒక బాలికను దుర్మార్గంగా చెరబట్టటమే కాదు.. బ్లాక్ మొయిల్ చేస్తూ పది మంది ఆమెకు మూడేళ్లుగా చూపిస్తున్న నరకం గురించి విన్నంతనే కన్నీళ్లు కారటం ఖాయం.
తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతం తాజాగా బయటకు వచ్చింది. అది కూడా బాధితురాలికుటుంబ సభ్యులు.. బంధువులు ధైర్యంగా ముందుకొచ్చి.. నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ చేయటంతో ఈ దుర్మార్గం మీడియా వరకూ వచ్చింది. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీలో ఈ దారుణం చోటు చేసుకుంది.
పాతబస్తీలోని కామాటిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ దుర్మార్గం వివరాలిలా ఉన్నాయి. పురానాపూల్ మురళీనగర్ కు చెందిన పదహారేళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. ఆమె ఇంటి సమీపంలోనే ఆమె మేనత్త కుటుంబం ఉంటుంది. మూడేళ్ల క్రితం మేనత్త కొడుకు రాజేశ్ సదరు బాధితురాలి మీద కన్నేశాడు. మాయమాటలు చెప్పి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఆమెపై స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా ఫోటోలు తీశాడు.
ఆమెపై తాము చేసిన పనిని బయటకు చెబితే.. ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తూ.. గడిచిన మూడేళ్లుగా పది మంది వరకూ స్నేహితులు ఆమెకు నరకం చూపించేవారు. భయంతో వారి వేధింపుల్ని.. బెదిరింపుల్ని సహిస్తున్నా.. అంతకంతకూ పెరుగుతున్న వారి హింసను తట్టుకోలేకపోయింది. తల్లిదండ్రులకు జరిగిన వైనాన్ని చెప్పింది.
బాధితురాలిని తీసుకొని ఆమె తండ్రి కామటిపుర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసిన పోలీసులు నిందితులు రాజేశ్.. శుభం.. అభిజిత్ కౌశిక్ లను డిసెంబరు 31న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే.. ఈ కేసులో నిందితుడైన విజయ్ అనే కుర్రాడ్ని పోలీసులు సాక్షిగా పేర్కొనటంపై బాధితురాలు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిందితుడైన వ్యక్తిని సాక్షిగా చూపించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేసు వీగిపోయేలా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ బాధితురాలి బంధవులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన భరోసా టీమ్.. బాధితురాలికి న్యాయం చేస్తామని.. ఈ ఇష్యూలో నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదన్న హామీతో ఆందోళనను విరమించారు. ఈ అన్యాయం గురించి వింటే ఒళ్లు మండిపోవటమే కాదు.. నిందితులది కోసి పారేయాలన్న కోపం రావటం ఖాయం. చిన్న బాలిక మీద మూడేళ్లుగా పది మంది మృగాళ్లు దారుణాలకు పాల్పడటం వింటేనే ఒళ్లు జలదరిస్తుంది.