కేపీఎల్‌ మ్యాచ్ ఫిక్సింగ్ లో ముగ్గురు హీరోయిన్స్ ..ఎవరంటే ?

Update: 2019-12-05 06:45 GMT
కేపీఎల్ ..కర్ణాటక ప్రీమియర్ లీగ్ .. ఈ లీగ్ ప్రస్తుతం కష్టాల్లో చిక్కుకొని ఎలా బయటపడాలో తెలియక అయోమయ పరిస్థితుల్లో ఉంది. గత కొన్ని రోజులుగా ఈ కేపీఎల్ పై ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో గురించి రోజుకొక వార్త వెలుగులోకి వస్తుంది. తాజాగా కేపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో సినీ తారలు ఉన్నట్టు సీసీబీ పోలీసులు గుర్తించారు. ఇన్ని రోజులు ఆటగాళ్లు, కోచ్‌లు, బుకీల బాగోతంతోపాటు హనీట్రాప్‌ మరక కూడా నమోదైంది. తాజాగా ఈ స్కామ్ లో నటీనటులు కూడా కలిశారు.

ఈ విషయంపై  పోలీసు కమిషనర్‌ భాస్కర్‌ రావు బుధవారం మీడియా తో మాట్లాడుతూ కేపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కు నటీనటులకు సంబంధం ఉందని అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. కేపీఎల్‌ మ్యాచ్‌ ముగిసిన రోజు రాత్రి స్టార్‌ హోటళ్ల లో జరిగే పార్టీల లో పలువురు తారలు పాల్గొన్నట్టు నిర్ధారించామని, వారిలో ముగ్గురు ప్రముఖ హీరోయిన్లు ఉన్నారని ఆయన చెప్పారు. వారు కొద్ది రోజుల్లోనే నటులు భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసిందని తెలిపారు. హఠాత్తుగా వీరికి అంత డబ్బు ఎలా వచ్చిందనే విషయాన్ని మున్ముందు విచారణ లో తెలుసుకుంటాం అని చెప్పారు. అలాగే  కేపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లలో సూత్ర ధారిగా వ్యవహరించిన బెళగావి పాంథర్స్‌ జట్టు కోచ్‌, మాజీ క్రికెటర్‌ సుధీంద్ర షిండే ను అరెస్టు చేశారు.

ఈ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వ్యవహారం కేపీఎల్‌ కు మాయని మచ్చ పడింది. ఇప్పటికే ఈ కేసు లో ఆటగాళ్లు, జట్ల యజమానులు, కోచ్‌ల తో కలుపుకుని సుమారు 9 మంది వరకు అరెస్టు అయ్యారు.   ఈ నేపథ్యంలో  ఈ ఫిక్సింగ్‌ కేసు తేలే వరకు కేపీఎల్‌ నిర్వహించరాదని కర్నాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం నిర్ణయించింది.  కేపీఎల్‌ మ్యాచ్‌ఫిక్సింగ్‌ రోజుకోమలుపు తిరుగుతుండడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Tags:    

Similar News