జేసీ దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్ అయ్యి బెయిల్ కూడా దొరకని స్థితిలో కడప జైల్లో అష్టకష్టాలు పడుతున్నారు.ఈ ఉపద్రవం చాలదన్నట్టుగా జేసీ బ్రదర్స్ కు భారీ షాక్ తగలింది.
తాజాగా జేసీ బ్రదర్స్ ముగ్గురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు పురోగతి సాధించారు.
నకిలీ పత్రాలు సమర్పించి బీఎస్3 వాహనాలను బీఎస్4గా మార్చి రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో జేసీ వర్గీయులు నాగేశ్వర్ రెడ్డి, సోమశేఖర్, రమేశ్ లను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
ఇటీవలే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. వారిని రెండు రోజుల విచారణ నిమిత్తం పోలీసులకు అనుమతిచ్చింది. దీంతో కడప జైలు నుంచి అనంతపురం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు వీరిద్దరిని తరలించనున్నారు.