ఎమ్మెల్యేగానో.. ఎంపీగానో విజయం సాధించి ఐదేళ్లు పదవిలో ఉంటే చాలు.. దశ తిరిగిపోతుంది. ఆ ఐదేళ్లు ఇక ఎదురే ఉండదు. పదవిని అడ్డం పెట్టుకుని ఏమైనా చేయొచ్చు. ఎంతైనా సంపాదించొచ్చు. అందుకే ఎన్నికల్లో విజయం కోసం ఏమైనా చేయడానికి తయారైపోతున్నారు రాజకీయ నాయకులు. ప్రత్యర్థి విజయాన్ని అడ్డుకోవడానికి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చెక్ పెట్టడం కోసం కేఏ పాల్‌కు చెందిన ప్రజాశాంతి పార్టీ తరఫున డమ్మీ అభ్యర్థుల్ని ఎలా బరిలోకి దింపుతున్నారో చూస్తున్నాం. వైకాపా అభ్యర్థుల పేరుతోనే ఉన్న అభ్యర్థుల్ని చాాలా నియోజకవర్గాల్లో బరిలోకి దించారు. వైకాపా ఫ్యాన్ గుర్తుకు దగ్గరగా ఉండే హెలికాఫ్టర్ గుర్తుతో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో జనాలు కన్ఫ్యూజై ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు ఓటు వేసేందుకు అవకాశం లేకపోలేదు.
కర్ణాటకలో సైతం ఇదే స్ట్రాటజీని అమలు చేస్తుండటం గమనార్హం. దివంగత నటుడు అంబరీష్ భార్య సుమలత.. ఒకప్పుడు తన భర్త ఎంపీగా ఉన్న మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అంబరీష్ చాలా ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి సేవలందించినప్పటికీ.. ఆయన భార్య మీద అభ్యర్థిని నిలపకూడదన్న నైతిక బాధ్యతను కాంగ్రెస్ పార్టీ మరిచింది. పొత్తులో భాగంగా జేడీఎస్‌కు సీటు కేటాయించింది. కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ అభ్యర్థిగా కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఐతే సుమలతకు మద్దతుగా భాజపా అభ్యర్థిని నిలబెట్టకపోవడం, సినీ స్టార్లు చాలామంది సుమలతకు మద్దతుగా నిలవడంతో ఆమెకే ఇక్కడ విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఐతే ఆమెను ఎలాగైనా దెబ్బ తీయాలని సుమలత పేరున్న మరో ముగ్గురు అభ్యర్థుల్ని ప్రత్యర్థి పార్టీలు నిలబెట్టడం విశేషం. వీళ్లందరూ ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్నారు. సుమలత కూడా ఇండిపెండెంటే. ఆమె గుర్తు జనాల్లోకి వెళ్లని పక్షంలో ఈ డమ్మీ అభ్యర్థుల కారణంగా సుమలతకు ఇబ్బంది తప్పకపోవచ్చు.