చిన్నమ్మ శశికళకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఓపక్క అమ్మ మేనకోడలు దీప చేస్తున్న వ్యాఖ్యలు మంట పుట్టిస్తుంటే.. మరోవైపు ఊహించని రీతిలో వస్తున్న విమర్శలు ఆమెకు ఇబ్బందికరంగా మారాయి. సమయం చూసుకొని తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తపిస్తున్న చిన్నమ్మకు తాజాగా తుగ్లక్ పత్రిక ఎడిటర్ ఎస్ గురుమూర్తి ఊహించని సాకిచ్చారు.
తాజాగా ఆయన ట్విట్టర్ మాథ్యమంలో ట్వీట్లను పోస్ట్ చేసి మరీ చిన్నమ్మ వర్గీయులకు వణుకు తెప్పించారు. అమ్మ మరణించిన తర్వాత శశికళ అన్నాడీఎంకే చీఫ్ అయ్యారన్న విషయాన్ని గుర్తుచేసిన గురుమూర్తి.. పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు రహస్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా వ్యాఖ్యానించారు.
అన్నాడీఎంకే పార్టీలో తమ కుటుంబ సభ్యులకు స్థానం లేదని.. వారిని దగ్గరకు రానివ్వననంటూ శశికళ గతంలో పేర్కొన్నారని.. అదేమీ నిజం కాదన్నారు. పార్టీ వ్యవహారాల్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ చొరవ చూపించరని శశికళ చెబుతున్న మాటల్లో నిజం లేదని చెబుతున్నారు. గతంలో అందరికి తెలిసిన శశికళ వేరని.. ఇప్పుడున్న శశికళ వేరుగా ఆయన అభివర్ణించారు. పార్టీలోకి కుటుంబ సభ్యుల్ని రప్పించటానికి ప్రయత్నిస్తున్నట్లుగా చేసిన ట్వీట్లు ఇప్పుడు చిన్నమ్మకు.. ఆమె పరివారానికి షాకింగ్ గా మారాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/