తుమ్మ‌ల కేసీఆర్‌ కు భ‌జ‌న్‌ లాలా..!

Update: 2016-01-01 09:32 GMT
తెలంగాణ‌లో టీఆర్ ఎస్ అధికారంలోకి వ‌చ్చాక టీడీపీలో నుంచి వ‌రుస‌గా వ‌ల‌స‌లు జ‌రిగిపోయాయి. అలా వెళ్లిన ముఖ్య నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు కూడా ద‌క్కాయి. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుతో పాటు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ టీడీపీ నుంచి వెళ్లి కేసీఆర్ కేబినెట్‌ లో కీల‌క‌మైన ప‌ద‌వులు అనుభ‌విస్తున్నారు. టీడీపీని వీడిన ఈ ఇద్ద‌రు నేత‌లు త‌మ సొంత పార్టీపై పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేసింది త‌క్కువే అని చెప్పాలి. త‌ల‌సాని అప్పుడ‌ప్పుడు చంద్ర‌బాబుపై ఫైర్ అయినా తుమ్మ‌ల మాత్రం సైలెంట్‌ గానే త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు.

 అయితే తాజాగా ఖ‌మ్మం ఎమ్మెల్సీ గెలిపించి మంచి జోష్‌ లో ఉన్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావును  భ‌జ‌న్‌ లాల్ అని టీడీపీ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ విమ‌ర్శించారు. ఈ వ్యాఖ్య‌ల‌ను తుమ్మ‌ల స‌మ‌ర్థంగా తిప్పికొట్టారు. తనను భజన్ లాల్ అని అనడం టీడీపీ నాయ‌కుల‌ అజ్ఞానం అన్న తుమ్మ‌ల‌...తాను భజన్ లాల్ - గజన్ లాల్‌ కాదని... తనపై కేసీఆర్ పెట్టిన న‌మ్మ‌కాన్ని తాను నిజం చేసి చూపించాన‌ని ఆయ‌న త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన టీడీపీ నాయ‌కుల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.

 అలాగే టీ టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఎర్రబెల్లి త‌న‌పై చేసిన ఆరోపణలకు అర్థం లేదని, ఆయన పార్టీలో ఉండడానికి ఒక రేటు, వెళ్లడానికి ఒక రేటు పెడుతుంటారని, ఆయన టీఆర్ ఎస్ వెయ్యి కోట్లు ఖర్చు చేసిందని ఆరోపిస్తే దానిని ఎవరూ పట్టించుకోర‌ని తుమ్మల అన్నారు. తాను ఎప్పుడూ ప్రజలతో ఉంటానని, తనకు రాజ‌కీయాలు నచ్చకపోతే పొలం దున్నుకుంటాను కానీ తప్పుడు వ్యవహారాలు చేయనని చెప్పారు.  తనతో పాటు టీడీపీ నుంచి నుంచి బయటకు వచ్చినప్పుడు 320 మంది టీఆర్ ఎస్‌ లో చేరార‌ని.. ఇది తనకు గర్వ కారణం అని అన్నారు. త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి త‌న‌తో పాటు టీఆర్ ఎస్‌ లో చేరిన వారికి తుమ్మ‌ల ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఖమ్మం వంటి జిల్లాలో ముప్పై ఐదేళ్లుగా తాను రాజకీయాల్లో నిలబడడం అసాధారణ విషయమని ఆయ‌న చెప్పారు.

మాజీ ముఖ్య‌మంత్రి జలగం వెంగళరావు - సిద్ధారెడ్డి వంటి ప్రముఖులు ప్రాథినిధ్యం వహించిన జిల్లా కావ‌డం... మరో వైపు నక్సలైట్ల ప్రాబల్యం - వామపక్షాలకు గ‌ట్టి ప‌ట్టున్న ఈ జిల్లాలో నిలబడడం అంత తేలికైన విషయం కాదని.... ఏ అభిప్రాయం అయినా నిర్మొహమాటంగా చెప్పడం వల్లే తాను ఇన్నేళ్లుగా రాజ‌కీయాల్లో నిలబడ్డానని తుమ్మల స్ప‌ష్టంచేశారు.
Tags:    

Similar News