ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి ఏమైతే ఉండకూడదో తనలో అదే ఉందన్న విషయాన్ని తన మాటలతో నిరూపించారు తెలంగాణరాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎప్పుడూ పాజిటివ్ వార్తల్లో ఉంటూ పెద్దమనిషిగా వ్యవహరించే ఆయన నోటి నుంచి వచ్చిన కమ్మటి వ్యాఖ్యల్లోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఎంత నేతలైనా.. కులానికి దాసులే అన్న మాట మంత్రి తుమ్మల మాటలు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. కులాభిమానం ఉండటం తప్పేం కాదు కానీ.. అది హద్దులు దాటితేనే ఇబ్బంది. సొంత కులాన్నిఅతిగా పొగుడుకున్న ఆయన మాటల వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. కుల వన భోజనాలు ఈ మధ్యన కామన్ అయిపోతున్నాయి.
ఇలాంటి కార్యక్రమానికి హాజరైన మంత్రి తుమ్మల తన సొంత కులమైన కమ్మ గొప్పతనాన్ని పొగుడుకున్న తీరు చూసినప్పుడు అవాక్కు కావటం ఖాయం. అన్నివర్గాలకు తాను మంత్రినన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
మనుషులంతా ఒక్కటేనన్న సందేశాన్ని మరిచిపోయి.. కులాల్లో కెల్లా కమ్మ కులానికి మించింది లేదని.. చివరకు ఆ బ్రహ్మ ఆశీస్సులుకూడా కమ్మలకు ఉన్నాయంటూ ఆయన చెప్పిన మాటల్ని.. ఆయన నోటి నుంచి వింటేనే బాగుంటుంది. అయితే.. ఇది మంత్రి తుమ్మల వాయిస్ కాదని.. కావాలనే ఎవరో మార్ఫింగ్ చేసి ఆయన్ను ఇబ్బందిపెట్టేందుకు ఇలాంటి వీడియో తయారు చేసి ఉంటారన్న వాదన వినిపిస్తుంది.నిజమో.. అబద్ధమో కానీ వైరల్ అవుతున్న ఈ వీడియోలోని మాటలు మాత్రం ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పక తప్పదు. ఈ వీడియోలోని మాటలపై మంత్రి తుమ్మల కాస్త క్లారిటీ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.
Full View