పౌరసత్వ సవరణ చట్టం మీద జరుగుతున్న నిరసనలు.. ఆందోళనలు తెలిసిందే. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు ఒకపక్క సాగుతున్న వేళ.. దానికి కౌంటర్ గా సంబరాలు షురూ అయ్యాయి. చూస్తుంటే.. నిరసనల్ని.. ఆందోళనల్ని న్యూట్రల్ చేసే పనిలో ఆయా వర్గాలు ముందుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. భారత పౌరసత్వం ఇస్తామంటూ కొందరు బౌద్ధులు తమకు వద్దంటే వద్దని చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పాకిస్థాన్.. బంగ్లాదేశ్.. ఆఫ్ఘనిస్థాన్ లకు చెందిన ముస్లిమేతరులందరికి భారత్ లో పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన కొత్త చట్టంపై ప్రత్యేక టిబెట్ కోసం పోరాడుతూ.. సుదీర్ఘకాలం భారత్ లోనే ఆశ్రయం పొందుతున్న వేలాది మంది బౌద్ధ భిక్షువులు మాత్రం తమకు భారత పౌరసత్వం అక్కర్లేదని చెప్పటం గమనార్హం.
టిబెటిన్ బౌద్ధ భిక్షకులు ఎక్కువగా కర్ణాటకలో నివసిస్తుంటారు. ఏళ్లకు ఏళ్లు వీరిక్కడే ఉన్నా.. భారత పౌరసత్వం మీద తమకు ఎలాంటి ఆసక్తి లేదని చెప్పటం విశేషం. చైనా ఆక్రమణ నుంచి టిబెట్ కు విముక్తి కల్పిస్తే చాలన్న మాట వారి నోట వినిపిస్తోంది.
టిబెట్ లో జరిగిన స్వతంత్రపోరాటాల నేపథ్యంలో 1959లో టిబెటన్ ప్రజలు వేలాదిగా భారత్ కు తరలివచ్చారు. అలాంటి వారిలో చాలామంది మైసూర్ జిల్లా పెరియపట్టణ తాలుకాలోని బైలకుప్పెలో 18వేల మంద.. గురుపురలో ఐదు వేల మంది.. చామరాజనగర్ లోని ఒడెయరపాళ్యలో ఐదు వేల మంది..ముండగోడలో 18వేల మంది బౌద్ధులు నివసిస్తున్నారు. ఏళ్లకు ఏళ్లుగా వారు ఉన్నప్పటికి భారత పౌరసత్వాన్ని వారు పొందలేదు.
వారి వద్ద పాస్ పోర్టు మినహా ఆధార్ తో పాటు ఓటరు గుర్తింపు కార్డులు కూడా ఉంవు. 1960 నుంచి 1987 మధ్యన దేశంలో జన్మించిన టిబెటియన్లకు పౌరసత్వం కల్పిస్తున్నప్పటికీ.. భారత పౌరసత్వం తీసుకోవటానికి మాత్రం వారు ఆసక్తి చూపించకపోవటం గమనార్హం. తమకు ఆశ్రయం ఇచ్చిన దేశం కంటే.. తమ మూలాలు ఉన్న దేశం మీదే తమకు ప్రేమ ఎక్కువ ఉందన్న విషయాన్ని చెప్పేస్తున్నారని చెప్పాలి.