వైసీపీలో అసంతృప్తి జ్వాలలు చెలరేగితే గట్టి వేసవి కాలం రోజులు అయినా బే ఫికర్ గా చలి కాచుకుందామని విపక్షాలు ఎదురుచూశాయి. అందులో ఎలాంటి తప్పు కూడా లేదు. రాజకీయాలు అంటే అవకాశాలు వెతుక్కోవడం, లేక వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవడం, ఇంకా తెలివి ఉంటే వాటిని తామే సృష్టించుకోవడం.
ఈ నేపధ్యంలో జగన్ మూడున్నర దశాబ్దాల క్రితం ఎన్టీయార్ చేసినట్లుగా మూకుమ్మడిగా మంత్రులను తీసి పక్కన పెట్టేశారు. దాంతో పాటు వంద మందికి పైగా ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం అర్రులు చాస్తున్నారు అన వార్తలతో వైసీపీ కొంపలు అంటుకోవడం ఖాయమని అంతా ఊహించారు.
కానీ జరిగింది వేరు. కొంపలు ఏవీ అంటుకోలేదు, తమకూ పదవులు రావాలని ఉందని, కానీ రాలేదు కాబట్టి సర్దుకుపోతున్నామని ఆశావహులు చెబుతూ కధ ముగించేస్తున్నారు. ఇక బయటకు బాధను వెళ్ళగక్కిన వారు సైతం అంతా హ్యాపీస్ అని మీడియా ముందు చెప్పుకున్నారు.
అయితే నిజంగా అలాగే జరిగిందా. వైసీపీలో అసంతృప్తి లేదా. అందరూ బుద్ధిగా దారికి వచ్చేశారా. జగన్ చెప్పినట్లుగానే అంతా జరిగిపోతుందా అంటే అది మాత్రం కాదూ కూడదనే చెప్పాలి. ఎందుకంటే రాజకీయం అన్నది నదీ ప్రవాహం లాంటిది. దానికి కుదురు నిలకడ అసలు ఉండదు. నిశ్చలంగా ఎందుకు ఉంటుంది. ఈ రోజుకు ఇంతే అని పెద్దలు గుండెల మీద చేయి వేసుకోవాలంతే.
మరి వైసీపీలో అసంతృప్తి ఉంటే అది ఎలా బయటకు వస్తుంది అంటే దానికీ ఒక టైమ్ ఉంది. ఒక లెక్క కూడా ఉంది అంటున్నారు. ఈ రోజుకు చూస్తే రెండేళ్లకు పైగా వైసీపీ చేతిలో అధికారం ఉంది. ఇపుడే జెండా ఎగరేస్తే అటూ కాకుండా పోతారు, ఇబ్బందులు పడతారు. పైగా జనాల మదిలో ఏముందో ఇంకా తేటతెల్లం కావడం లేదు. ప్రజలలో నిండుగా అసంతృప్తి వస్తే కనుక అపుడు వైసీపీలో అసమ్మతి పాము పడగ ఎత్తినట్లుగా బయటకు రావడం ఖాయం.
ఇక ప్రజా సమస్యల పేరిట హల్ చల్ చేసే హార్డ్ కోర్ బ్యాచ్ కూడా తయారు కావడమూ జరుగుంది. ఇంకో వైపు చూస్తే వచ్చే ఎన్నికలలో టికెట్ల గొడవ ఎటూ ఉంటుంది. ఇపుడు గమ్మున ఉండక పోతే మంత్రి పదవి దేముడెరుగు 2024 నాటికి టికెట్ కే టిక్కు పడిపోతుంది. అందుకే తెలివైన వారు సైలెంట్ అయ్యారు అనుకోవాలి.
ఇంకో వైపు చూస్తే ఇప్పటి నుంచే అసమ్మతి గొంతులు బయట పడవు. రాజనీతి తెలిసిన వారు జాగ్రత్తగా ప్రతీ రోజూ పరిస్థితిని గమనిస్తారు. ఎక్కడ బాగుంటుంది. రేపటి రోజున ఏ పార్టీకి అవకాశాలు బాగా ఉన్నాయి అన్న దాని మీద ఎవరి సర్వేలు వారు చేసుకుంటారు.
అలాగే ఉన్న పార్టీలో టికెట్ కూడా దక్కదు అని తేలితే మాత్రం 2023 చివరలో కానీ 2024 మొదట్లో కానీ అసంతృప్తులు పెద్ద గొంతు చేయడం ఖాయం. ఇక ఏపీలో మళ్లీ వైసీపీయే వస్తుంది అన్న సూచనలు ఉంటే కనుక తమకు సీటు కన్ ఫర్మ్ అని భావిస్తే కనుక ఎంతటి అసంతృప్తి ఉన్నా అది గొంతు దాటి బయటకు కూడా రాదు. మొత్తానికి వైసీపీలో అసంతృప్తులు ఉన్నాయా అంటే లేవూ అని గట్టిగా చెప్పలేని స్థితి మాత్రం ఇపుడు ఉంది. మంచి కాలం కోసం రాజకీయ జీవులు వెయిట్ చేస్తారు అన్నది వాస్తవం.