గోల్ఫ్ స్టార్ కు యాక్సిడెంట్.. సీరియస్
దిగ్గజ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియాలో మంగళవారం (ఫిబ్రవరి 23)న ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
టైగర్ వుడ్స్ కాలిఫోర్నియాలోని బ్లాక్ హార్స్ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి ఆయన కారు బోల్తా పడింది. రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు పక్కభాగం నుజ్జునుజ్జు అయ్యింది.
టైగర్ వుడ్స్ కారులో ఇరుక్కుపోగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆయనను రక్షించి ఆస్పత్రికి తరలించారు. టైగర్ కాలికి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాద సమయంలో కారులో టైగర్ వుడ్స్ ఒక్కరే ఉన్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 7.15 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.
టైగర్ వుడ్స్ రోడ్డు ప్రమాదానికి గురవడం ఇదే తొలిసారి కాదు.. గంతో రెండు సార్లు 2009,2017లో ఆయన కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టైగర్ వుడ్స్ తీవ్రంగా గాయపడినట్లు తేలడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.