స‌త్యేంద్ర జైన్‌.. మా అంతు చూస్తామ‌న్నారు: తీహార్ జైలు అధికారుల సంచ‌ల‌న ఆరోప‌ణ‌

Update: 2023-01-06 11:35 GMT
తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీలోని ఆప్ స‌ర్కారులో కీల‌క నాయ‌కుడు, మంత్రి స‌త్యేంద్ర జైన్‌.. త‌మ‌ను తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించార‌ని, మీ అంతు చూస్తానంటూ బెదిరించార‌ని.. తీహార్ జైలు ఉన్న‌తాధికారులు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. గ‌త ఏడాది మేలో వెలుగు చూసిన‌.. మ‌నీలాండ‌రింగ్ కేసులో ఈడీ అధికారులు స‌త్యేంద్ర‌జైన్ ను అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను తీహార్ జైలుకు త‌రలించారు.

అయితే.. జైలు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ తాజాగా స‌త్యేంద్ర‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌కు తీహార్ జైళ్ల విభాగానికి సంబంధించిన అద‌న‌పు ఇన్ స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌, జైళ్ల శాఖ ఎస్పీ, డీఎస్పీ, ఏఎస్పీ స‌హా.. కొంద‌రు న్యాయ శాఖ అధికారుల కూడా ఫిర్యాదు చేశార‌ని.. తెలిపారు. ``వారిని బూతులు తిట్టారు. హెచ్చ‌రించారు. జైలు నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన త‌ర్వాత‌.. ప‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని బెదిరించారు`` అని డీజీ మీడియాకు తెలిపారు.

ప్ర‌ధానంగా ఇద్ద‌రు జైలు అధికారులు ఫిర్యాదు చేసిన‌ట్టు చెప్పారు. గ‌త నెల 8న ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌న్నా రు.  నవంబర్ 25కి సంబంధించి, " జైన్‌ అక్రమాలకు" సంబంధించి, శిక్షలకు సంబంధించి, 2018 డిపిఆర్‌లోని రూల్ 1272 ప్రకారం సత్యేందర్ జైన్ కు షోకాజ్ నోటీసు ఇవ్వడానికి వెళ్లినప్పుడు బెదిరించాడని వారు పేర్కొన్నారు. జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత త‌గిన గుణ‌పాఠం చెబుతాన‌ని హెచ్చ‌రించిన‌ట్టు తెలిపారు.

సంఘటన నివేదిక ప్రకారం, సత్యేందర్ జైన్, "నాకు అన్నీ తెలుసు. అదంతా లా ఆఫీసర్ చేస్తున్నాడు. నేను బయటకు వచ్చిన తర్వాత సూపరింటెండెంట్  అంతు చూస్తా. (నేను) సిసిటివి ఫుటేజీని తీసుకుంటా" అని చెప్పాడని ఆరోపించాడు. అంతేకాదు, ``అతనికి పని ఎలా చేయాలో నేర్పండి`` అని కూడా సత్యేందర్ హెచ్చ‌రించిన‌ట్టు చెప్పారు.  ఇతర అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని జైలు సూపరింటెండెంట్ తన ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేప‌థ్యంలో సాధ్య‌మైనంత త్వ‌ర‌గా.. స‌త్యేంద‌ర్‌ను వేరే జైలుకు త‌ర‌లించాల‌ని తాము కోరుతున్న‌ట్టు డీజీ పేర్కొన్నారు. కాగా, ఈ ఆరోప‌ణ‌ల‌పై ఆప్ నేత‌లు కానీ, ఢిల్లీ ప్ర‌భుత్వం కానీ స్పందించ‌లేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News