ఆమె టిక్ టాక్ లో మస్తు పాపులర్. వీడియో చేసి పోస్ట్ పెడితే చాలు వేలల్లో వచ్చి పడే లైకులు చాలాసార్లు లక్షను దాటి లక్షన్నర వరకూ వెళ్లిపోతుంటాయి. ఆమె టిక్ టాక్ అకౌంట్లో ఉన్న పాలోవర్లే 1,99,100 మంది. ఇక.. ఆమె పోస్ట్ చేసే వీడియోలకు సగటున వచ్చే లైకులు లక్ష నుంచి లక్షన్నర వరకూ ఉంటాయి. చాలా వీడియోలు 1.59లక్షల లైకులకు తగ్గని పరిస్థితి. సోషల్ మీడియాలో ఇంత ఇమేజ్ ఉన్న ఆమెను ఎన్నికల బరిలో దించితే తిరుగు ఉండదని భావించింది బీజేపీ.
ఆమె పెట్టే వీడియోకు వచ్చే లక్షన్నర లైకులు ఓట్ల రూపంలో పడితే.. తిరుగులేని రీతిలో విజయం సాధించటం ఖాయమని లెక్కలు వేసుకుంది. అలానే బరిలోకి దించింది కానీ.. టిక్ టాక్ వీడియోకు.. ఎన్నికల సందర్భంగా వేసే ఓట్లకు లెక్కకు ఏ మాత్రం లింకు లేదన్న విషయం అర్థమయ్యేసరికి.. పార్టీ ఓటమిపాలైన పరిస్థితి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో టిక్ టాక్ సెలబ్రిటీ సోనాలి ఫొగాట్ ను ఎన్నికల్లో తమ అభ్యర్థిగా నిలిపింది. ఆదంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సోనాలిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కులదీప్ భిష్ణోయ్ దాదాపు 30 వేలఓట్ల తేడాతో విజయం సాధించారు.
టిక్ టాక్ అకౌంట్లో 1.99లక్షలమంది ఫాలోయర్లు ఉన్నప్పటికీ.. ఆమెకు పడిన ఓట్లు మాత్రం 34,222 మాత్రమే. అంటే..ప్రతి ఆరుగురు ఫాలోయర్లలో ఒక్కరు మాత్రమే ఓటు వేసిన వైనం అర్థమవుతుంది. సోషల్ మీడియాలో లైకులు నియోజకవర్గానికే పరిమితం కాదన్నది మర్చిపోకూడదు. ప్రపంచవ్యాప్తంగా ఆమెను ఫాలో అయ్యేదానికి.. ఆమె బరిలో నిలిచిన నియోజకవర్గంలో ఆమెకు ఉన్న ఫాలోయర్లకు సంబంధం ఉండదు. పైపైన లెక్కలతో పార్టీ టికెట్ ఇస్తే ఎంత ఇబ్బంది అన్న విషయం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమైందంటున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం మీద స్టార్లకు ఉండే ఇమేజ్ కు.. ఎన్నికల్లో నిలుచునే వారి పాపులార్టీకి ఏ మాత్రం లింకు ఉండదన్న విషయం బీజేపీ అధినాయకత్వానికి ఇప్పటికైనా అర్థమై ఉంటుందంటారా?