సీఎం పై చిందులు తొక్కిన స్టార్‌ బాక్సర్‌ !

Update: 2020-08-26 16:30 GMT
రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో మాత్రమే చెల్లని , చేయలేని హామీలు ఇస్తారని అనుకున్నా అని , కానీ ,రాజకీయ నాయకులు ఇచ్చే ప్రతి హామీ ఒకటే అని, అప్పటికి పబ్బం గడపడానికి మాత్రమే అందరిని ఆకట్టుకోవడానికి హామీల వర్షం కురిపిస్తారని , ఆ తరువాత ఆ ఆవైపు కూడా చూడరు అని స్టార్‌ బాక్సర్‌ సిమ్రన్‌ జిత్‌ కౌర్‌ పంజాబ్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసారు. టోక్యో ఒలింపిక్స్‌ కు అర్హత సంపాదించిన ఈ బాక్సర్ ‌కు అయిదు నెలల కిందట సీఎం అమరీందర్‌ సింగ్‌ ఎన్నో హామీలు ఇచ్చారట. అందులో ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదట. ఓ ఇంటర్వ్యూలో ఇవన్నీ చెప్పుకుని తెగ బాధపడింది సిమ్రన్‌ జిత్‌ కౌర్‌..అదే టిక్‌టాక్‌ స్టార్లకైతే వెంటనే ఆర్థిక సాయం చేతికందుతోందని విమర్శలు కూడా కురిపించింది.

ఇప్పటికైనా తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఆర్ధిక కష్టాలతో ఉన్నానని ప్రభుత్వానికి విన్నవించుకుంది. అసలు పంజాబ్‌ ప్రభుత్వం ఏ విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆర్ధికసాయం అందిస్తున్నదో అర్థం కావడం లేదని సిమ్రన్‌ చెప్పుకొచ్చింది. సిమ్రన్‌జిత్‌ కౌర్‌ టోక్యో ఒలింపిక్స్‌ కు అర్హత సంపాదించడంతో మీడియా ద్వారా ఆమె ఆర్ధిక పరిస్థితిని తెలుసుకున్నారు ముఖ్యమంత్రి అమరీందర్ ‌సింగ్‌.. అప్పుడే అయిదు లక్షల రూపాయల ఆర్ధిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. సీఎం హామీ ఇచ్చింది ఈ ఏడాది జనవరిలో అయితే ఆ హామీ ఇచ్చి 8 నెలలు కాలం గడిచినా కూడా ఇంకా ఆ హామీని నెరవేర్చకపోవడం తో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసారు. చూడాలి ఈ స్టార్ బాక్సర్ వ్యాఖ్యలపై పంజాబ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో ..
Tags:    

Similar News