ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ మోడీని మరోసారి తన అక్షరంతో పదునైన విమర్శ చేసింది. ఏకంగా.... ఇండియాస్ డివైడర్ అన్న భారీ బరువైన వ్యాఖ్యను చేసింది. దానికి తగ్గట్లే ఒక ఫొటోను కవర్ పేజీగా వేసింది. ఇది ఎన్నికల ఫలితాలకు మూడు రోజుల ముందు ఇండియాలో విడుదల కానుంది. మోడీపై టైమ్ మ్యాగజైన్ ఈ స్థాయిలో రాయడం ఇది రెండోసారి. గతంలో ఓ సారి 2012లో కూడా మోడీ గురించి టైమ్ మ్యాగజైన్ ఓ ప్రత్యేక కథనం ప్రచురించింది ... అపుడు మోడీని వివాద ప్రియుడుగా పేర్కొన్న టైమ్ ఇపుడు ఇండియాలో హిందు - ముస్లింల మధ్య విభజన రేఖ గీసిన వాడిగా పేర్కొనడం గమనార్హం.
ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో మోడీపై చేసిన ఈ భారీ కామెంట్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు గాని బాగా వైరల్ అవుతోంది. హిందూ ముస్లిం ల మధ్య మతపరమైన విభజన చేయడానికి మోడీ ఆసక్తి చూపిస్తాడని, అదే విధంగా ఈ ఐదేళ్లు పనిచేశాడని పేర్కొంది. ఇలాంటి ప్రధానిని మరో ఐదేళ్లు ఇండియా భరించగలదా అన్న కోణంలో విశ్లేషిస్తూ జర్నలిస్ట్ అతిష్ తఫీర్ దీనిని రాశారు.
ఇందులో నెహ్రూకి - మోడీకి ఉన్న తేడాలను కూడా పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ను, నెహ్రూను తన ఎదుగుదలకు ఉపయోగపడేలా ఎలా డ్యామేజ్ చేశాడన్నదే ఈ ఆర్టికల్ సారాంశంగా చెబుతున్నారు. స్థూలంగా ఇది మోడీని విమర్శిస్తూ ప్రచురించిన కథనమే అయినా దీని వల్ల మోడీకి కలిగే నష్టమేమీ ఉండకపోవచ్చు. వారు పెట్టిన శీర్షకే ఆ విషయాన్ని నిరూపిస్తుంది.