డాలర్స్ డ్రీమ్ కు దగ్గరి దారి ఏమైనా ఉందంటే.. అది అమెరికాకు వెళ్లేందుకు అవసరమైన వీసా రావటమే. ఇక.. ఉద్యోగాల కోసం కోటి ఆశలు పెట్టుకునే హెచ్ 1బీ అప్లికేషన్లకు సంబంధించిన కీలక ప్రకటన ఒకటి వెల్లడైంది. వచ్చే ఏడాది అంటే 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్లై చేసే దరఖాస్తులకు గడువు ముగిసినట్లుగా యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్.. పొట్టిగా చెప్పాలంటే యూఎస్ సీఐఎస్ పేర్కొంది.
అప్లై చేసుకున్న వారిని లాటరీ ద్వారా ఎంపిక చేసిన వివరాల్ని.. వారి దరఖాస్తులకు సంబంధించిన డిటైల్స్ ను ఆయా సంస్థలకు మార్చి 31 లోపు సమాచారాన్ని ఇస్తామని చెబుతున్నారు. హెచ్ 1 బీ అప్లికేషన్లకు పేర్కొన్న 65 వేల దరఖాస్తుల స్వీకరణ పరిమితిని తెలిపింది. ఈ వీసాలకు సంబంధించిన తమకు వచ్చిన అప్లికేషన్లు ఎన్ని అన్న విషయాన్ని మాత్రం వెల్లడించక పోవటం గమనార్హం.
సాధారణంగా హెచ్ 1బీ వీసాలతో అమెరికాకు వెళ్లాలని తీవ్రంగా ప్రయత్నించే దేశాల్లో భారత్.. చైనాలు పోటీ పడుతుంటాయి. ఈ వీసాల్ని ఐటీ నిపుణులు వేలాది గా కోరుతుంటారు. మరి.. ఈసారి వీసాలకు సంబంధించిన దరఖాస్తులు ఏ దేశం నుంచి ఎన్ని వచ్చాయన్నది ఒక ప్రశ్న అయితే.. ఇప్పుడున్న పరిస్థితులు మరింత కాలం కొనసాగితే.. అమెరికాకు వెళ్లే విషయంలో ఐటీ నిపుణులు కాస్త ఆలోచనలో పడే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.