అధికారమా మజాకానా? ఎంత పెద్ద మీడియా సంస్థ అయితే మాత్రం పవర్ ముందు దిగదుడుపే. ఆ విషయాన్ని తాజాగా మరోసారి ఫ్రూవ్ అయ్యిందని చెప్పాలి. కొద్ది రోజుల క్రితం ప్రధాన విభజనకారుడు అంటూ మోడీపై సంచలన కథనాన్ని వండి వార్చేసిన ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగ జైన్ యూటర్న్ తీసుకుంది.
తాజాగా విడుదల చేసిన సంచికలో ఆ సంస్థ మోడీ దేశాన్ని ఏకం చేశారంటూ గతంలో తాను చేసిన తప్పును చెంపదెబ్బ వేసుకున్న రీతిలో కవర్ పేజీ కథనాన్ని అచ్చేసింది. మంగళవారం విడుదలైన ఈ మ్యాగ్ జైన్ లో మోడీ గురించి గొప్పగా రాశారు. మోడీ తన అధికారాన్ని నిలబెట్టుకోవటమే కాదు.. తన మద్దతును పెంచుకున్నారన్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. భారతదేశంలో మోడీ ఒక ప్రధాన తప్పుడు రేఖను దాటారని పేర్కొంది. వెనుకబడిన సామాజిక తరగతిలో పుట్టిన మోడీ దేశంలో అత్యున్నత స్థాయికి చేరటం హర్షనీయమని.. ఇన్ని దశాబ్దాల్లో దేశంలో మరే ప్రధానమంత్రి కూడా దేశాన్ని ఈ రీతిలో ఐక్యం చేయలేదని పేర్కొన్నారు. మోడీ ఆ ఘనతను సాధించినట్లుగా సదరు వ్యాసంలో పేర్కొన్నారు. జనాదరణ భారీగా ఉన్నప్పుడు మీడియా రాతలు మారతాయనటానికి తాజా ఉదంతం పెద్ద ఉదాహరణగా చెప్పక తప్పదు.