మొదట ఒకరు వన్ సైడ్ లవ్ సిగ్నల్స్ పంపించారు. ఆ మీదట మరొకరు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా అంతా కలసిపోదామని ఓపెన్ గా చెప్పేశారు. ఇక మళ్లీ మొదటాయన అందరూ కలవాలి అంతా ఒక్కటిగా రావాలీ అంటూ పల్లవికి చరణం పాడారు. టోటల్ గా చూసుకుంటే తెర వెనక కధ చాలానే జరిగిపోయింది అనిపిస్తోంది. ఇక తెర ముందు కూడా హింట్లను బట్టి చూస్తే తొందరలోనే బిగ్ బ్రేకింగ్ న్యూస్ కి రంగం సిద్ధం అవుతోంది అని అంటున్నారు.
ఇంతకీ ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే టీడీపీ జనసేన పొత్తులే. రాయలసీమలోని కుప్పంలో చంద్రబాబు వన్ సైడ్ లవ్ అంటే గుంటూరు గడ్డ మీద పవన్ పల్లవి పాడారు, గోదావరి గట్టు మీద చంద్రబాబు చరణాలు పాడాక ఇక పల్లవి మళ్ళీ ఎత్తుకోవాల్సింది ఎవరు. ఇంకెవరు. జనసేనాని పవన్ కళ్యాణ్ అని చెబుతున్నారు.
దాంతో ఇపుడు అందరి చూపూ ఆయన మీదనే ఉంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ బాబు పొత్తుల మాట మీద ఏమంటారు అన్నదే ఇపుడు హాట్ టాపిక్. పవన్ ఈ నెల 8న రాయలసీమ టూర్ చేస్తున్నారు. ఆయన కర్నూల్ జిల్లాలో రైతు పరామర్శ యాత్రను చేపడుతున్నారు. దాంతో సీమ నుంచే గ్రీన్ సిగ్నల్స్ పవన్ బాబు పంపిస్తారు అని అంటున్నారు.
పవన్ బహిరంగ సభలకు వచ్చినా యాత్రలు చేసినా ఎపుడూ సంచలన కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆయన బాంబుల్లాంటి మాటలు కూడా పేల్చుతారు. ఈసారి ఆయన వైపు మీడియా ఫుల్ ఫోకస్ పెట్టింది. దానికి కారణం గోదావరి తీరాన బాబు చేసిన పొత్తుల ప్రతిపాదన. దానికి పవన్ ఎస్ అని చెబుతారా చెబితే ఎలా చెబుతారు అన్నదే ఇక్కడ డిస్కషన్.
ఇక జనసేనలో చూసుకుంటే పొత్తుల పట్ల పూర్తి సుముఖంగా ఉన్నారనే అంటున్నారు. బాబు ప్రకటన మీద ఇప్పటికే జనసేనలో నంబర్ టూ అయిన నాదెండ్ల మనోహర్ తాము కూడా అందరూ కలిస్తేనే వైసీపీని దించడం సాధ్యమని అభిప్రాయపడుతున్నట్లుగా చెప్పారు. అంటే దీని మీద కొంత క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక మిగిలింది పవన్ బాబు మళ్లీ పల్లవి అందుకోవడమే.
ఇక్కడ ఒక కో ఇన్సిడెంట్ ఏంటి అంటే రాయలసీమలోనే బాబు వన్ సైడ్ లవ్ పుట్టింది. అదే సీమ గడ్డ మీద నుంచే గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ క్రెడిట్ అంతా రతనాల సీమకే దక్కుతుందేమో. మొత్తానికి ఏపీ మీడియా అంతా బిగబట్టి చూస్తోంది. పవన్ కర్నూల్ లో ఏం మాట్లాడుతారు అన్నదే టెన్షన్. టీడీపీ సైతం దీని మీదనే చూస్తోంది. పవన్ చెప్పే ఆ ఒక్క మాట టోటల్ ఏపీ పాలిటిక్స్ ని చేంజ్ చేసి పారేయడం మాత్రం డ్యామ్ ష్యూర్.