ఎన్నికల దగ్గరపడుతున్న వేళ ఓటర్ల నాడి తెలుసుకునేందుకు వివిధ చానెల్స్ - సర్వే సంస్థలు పోటీ పడుతుంటాయి. అందులో భాగంగా ఎవరు గెలుస్తారు అని సర్వేలు చేస్తుంటాయి. గత 6 నెలలుగా ఏపీలో ఎవరు గెలుస్తారు - అధికారం ఎవరు చేపడతారు అని వివిధ సర్వే సంస్థలు సర్వేలే చేస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని సర్వేల్లో వైసీపీనే అధికారం హస్తగతం చేసుకుందని అన్నీ సర్వేలు తేల్చిచెప్పాయి. ఇప్పుడు టైమ్స్ నిర్వహించిన సర్వేలో కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కన్ ఫర్మ్ అని ఓటర్లు స్పష్టమైన తమ అభిప్రాయాన్ని చెప్పారు.
ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలున్నాయి. ఒక్కొక్క ఎంపీ స్థానం కింద 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అవుతాయి. ఇక టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో వైసీపీకి 22 ఎంపీ సీట్లు తేలింది. 22 ఎంపీ సీట్లు అంటే.. దాదాపు 150 సీట్లును జగన్ గెల్చుకుంటాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్లు 88. అంటే జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపొందడం పక్కా అని సర్వేలు చెప్తున్నాయి. ఇక ఓట్ షేర్ పరంగా చూస్తే - వైసీపీకి 48.8 శాతం - టీడీపీకి 38.40 శాతం ఓట్లు రావొచ్చని టైమ్స్ నౌ అంచనా వేసింది. బీజేపీకి 5.80 శాతం - కాంగ్రెస్ కు 2.20 శాతం ఓట్లు రావొచ్చని పేర్కొంది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ ఎస్ పార్టీ కారు దూసుకెళుతుందని టైమ్స్ నౌ సర్వేలో స్పష్టంగా తేలింది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో 13 సీట్లు టీఆర్ ఎస్ గెలుచుకోవచ్చని సర్వేలో వచ్చింది. బీజేపీ 2 - కాంగ్రెస్ 1 - ఇతరులు ఒక సీటు సాధించవచ్చని అంచనా వేసింది. ఓట్ షేర్ పరంగా చూస్తే టీఆర్ ఎస్ పార్టీకి 41.20 శాతం - కాంగ్రెస్ కు 30.30 శాతం - బీజేపీకి 17.60శాతం - ఇతరులకు 10.90 శాతం ఓట్లు రావొచ్చిన టైమ్స్ నౌ - వీఎంఆర్ అభిప్రాయ సేకరణలో వెల్లడైంది.