నవంబర్ 10వ తేదీన టిప్పు సుల్తాన్ జయంతిని ఘనంగా చేపట్టాలని నిర్ణయించిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్రమంలో వివాదంలో పడింది. టిప్పు సుల్తాన్ జయంతి నిర్వహణ ఏర్పాట్లను సవాలు చేస్తూ ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ ను దాఖలు చేయగా ఈ వాజ్యంపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఘటుగా స్పందించింది. టిప్పు సుల్తాన్ స్వాతంత్య్ర సమయరయోధుడేం కాదుకదా.. తన ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి పోరాడిన రాజే కదా.. అటువంటప్పుడు ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం ఏంటి? # అని విజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ సుబ్రోకమల్ ముఖర్జీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ ఆర్ బీ బుధిహాల్ స్పందిస్తూ.. టిప్పు జయంతి నిర్వహణ వల్ల కొడగూ - ఇతర ప్రాంతాల్లో తలెత్తే మతపరమైన ఆందోళనపై ప్రశ్నించారు. గతేడాది జరిపిన టిప్పు జయంతి వేడుకల సందర్భంగా తలెత్తిన శాంతిభద్రతల సమస్యను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావనకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది ఎంఆర్ నాయక్ తన వాదనలు వినిపిస్తూ.. జయంతి వేడుకల నిర్వహణను సమర్థించుకున్నారు. టిప్పు ఓ గొప్ప యోధుడని - బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాడని పేర్కొన్నాడు. పిటిషనర్ తరపు న్యాయవాది స్పందిస్తూ.. టిప్పు క్రూరమైన పరిపాలకుడని ఆరోపించారు. కొడవాలు - కొంకణీలు - క్రైస్తవులను కడతేర్చాడని తెలిపాడు. అందుకే జయంతి నిర్వహణ వల్ల పలు వర్గాల మనోభావాలు దెబ్బతినడాన్ని ఆయన డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకువచ్చారు. వాదోపవాదాలు విన్న ధర్మాసనం కేసు విచారణను నేటికి వాయిదా వేసింది. కర్ణాటకలోని సదరు వర్గాలే కాకుండా ఆర్ ఎస్ ఎస్ - బీజేపీలు సైతం టిప్పు జయంతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/