చైనా స‌రిహ‌ద్దుల్లో టిప్పు సుల్తాన్, ఔరంగ‌జేబు

Update: 2016-07-19 07:41 GMT
భార‌త‌దేశ రాజులు చ‌రిత్ర‌లో ఎంద‌రో గొప్ప యోధులు - చ‌క్ర‌వ‌ర్తులు ఉన్నారు. గొప్ప పాల‌కులూ ఉన్నారు. బ్రిటిష్ వారిని ఎదిరించిన రాజులూ చ‌రిత్ర‌లో ఉన్నారు. టిప్పు సుల్తాన్ - రాణాప్ర‌తాప్‌ - ఔరంగ‌జేబు వంటి రాజుల పేర్లు ఇప్ప‌టికీ వినిపిస్తుంటాయి. అయితే... ఈ గొప్ప రాజులంతా భార‌త సైన్యంలో చేరితే.. చేరితే ఏంటి ఇప్ప‌టికే చేరారు. ఆరు నెల‌లుగా భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దుల్లో సేవ‌లందిస్తున్నారు. టిప్పు సుల్తాన్‌ - రాణాప్ర‌తాప్ - ఔరంగ‌జేబులు సరిహద్దుల్లో కాప‌లా కాస్తుండడమేమిటి? అని అనుకుంటున్నారా.. ఆశ్చ‌ర్య‌పోవ‌ద్దు. నిజ‌మే..  వీరంతా అప్ప‌టి రాజులూ కారు - మ‌న సైనికులూ కారు. చైనా సరిహద్దు వెంబడి వాస్తవాధీన రేఖ వద్ద భారత్ మోహరించిన యుద్ధ ట్యాంకుల పేర్లు ఇవి.

తూర్పు లఢఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వెంబడి రోడ్డు - బంకర్లు నిర్మించుకుంటున్న భారత్ ఆర్మీ దాదాపు వంద యుద్ధ ట్యాంకులను మోహరించింది. వీటిలో మూడు ట్యాంకర్ల పేర్లు టిప్పు సుల్తాన్ - మహారాణా ప్రతాప్ - ఔరంగజేబు. ఆరు నెలల క్రితమే అధికారులు వీటిని సరిహద్దుకు తరలించారు.1965లో చైనాతో జరిగిన యుద్ధం  తర్వాత సరిహద్దు వెంబడి ఎటువంటి మోహరింపులు కానీ, నిర్మాణాలు కానీ భారత్ చేపట్టలేదు. మరోవైపు చైనా మాత్రం తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. దీంతో కొద్దికాలంగా  ఇండియన్ ఆర్మీ ఈ ప్రాంతంపై దృష్టి సారించింది. దాదాపు వంద యుద్ధ ట్యాంకులను మోహరించింది. అందులో భాగంగానే టిప్పు సుల్తాన్ - రాణా ప్ర‌తాప్‌ - ఔరంగ‌జేబుల‌ను అక్క‌డికి పంపించారు.

కాగా అత్యంత శీత‌ల వాతావర‌ణం ఉండే ఈ ప్రాంతంలో యుద్ధ ట్యాంకులను నిర్వహించడం చాలా క‌ష్ట‌మైన ప‌ని. మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రత వాటి పనితీరును దెబ్బతీస్తుంది. దీంతో ఆర్మీ ప్రత్యేక లూబ్రికెంట్లు ఉపయోగించి వాటి పనితీరు దెబ్బతినకుండా కాపాడుతుంద‌ట‌.
Tags:    

Similar News