తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఎన్నికల కోలాహాలం నడుస్తూనే ఉంది. ఒక దాని తర్వాత మరొకటి అంటూ వరుసగా ఎన్నికలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ మద్యే ఏపీలో స్థానిక ఎన్నికలు , జెడ్పిటిసి , ఎంపీటీసీ ఎన్నికలు కూడా ముగిశాయి. ఇదిలా ప్రస్తుతం ఏపీలో ,తెలంగాణ లో ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో తిరుపతి లోక్ సభ నియాజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 17 న ఈ రెండు చోట్ల పోలింగ్ జరగబోతుంది. నోటిఫికేషన్ వచ్చిన సమయం నుండి అన్ని పార్టీల నేతలు కూడా విజయం కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ రోజుతో ప్రచార పర్వానికి ముగింపుపడబోతోంది. 17 న ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 2 న దీని ఫలితాలు వెలువడనున్నాయి.
ఇక నాగార్జున సాగర్ విజయం టిఆర్ ఎస్ కి చాలా కీలకం , దుబ్బాక లో ఓటమి తర్వాత , జీహెచ్ ఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠం అందుకున్నా కూడా బీజేపీ అక్కడ బాగా పుంజుకుంది. ఇక సాగర్ లో కూడా బీజేపీ , కాంగ్రెస్ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండటంతో సాగర్ గెలిచి టిఆర్ ఎస్ కి తిరుగులేదు అని నిరూపించాలని తహతహలాడుతోంది. దీనితోనే ఇప్పటికే టిఆర్ ఎస్ బడా నేతలందరూ సాగర్ లో ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ కూడా ప్రచార పర్వంలో ఫైనల్ టచ్ ఇచ్చారు. ఈ సభలో సీఎం కేసీఆర్ నియోజకవర్గం పై వరాల జల్లు కురిపిస్తూనే, బీజేపీ , కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకొని విమర్శలు కురిపిస్తూ , టిఆర్ ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఉప ఎన్నికల నేపథ్యంలో గత 20 రోజులుగా ప్రధాన పార్టీలు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆది నుంచి ప్రచారంలో టీఆర్‌ఎస్ దూకుడు ప్రదర్శిస్తున్నది. సీఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు ఓటు వేయాలని టీఆర్‌ఎస్ నేతలు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ , బీజేపీ కూడా సాగర్ లో విజయం కోసం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచార పర్వానికి ఈ రోజే చివరి రోజు కావడంతో కీలకనేతలందరూ ప్రచారంలో స్పీడ్ పెంచి , ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే..తిరుపతి లో పోటీ తీవ్రంగా ఉంది. విజయం కోసం అన్ని పార్టీలు కూడా సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ మధ్య తిరుపతి బై పోల్ వేదికగా మాటల మరియు రాజీనామాల యుద్ధం నడుస్తుంది. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి , . అధికార వైసీపీ అభ్యర్తిగా డాక్టర్ గురుమూర్తి , తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ , కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ బరిలో ఉన్నారు. భారీ ఆధిక్యాన్ని దక్కించుకోవాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యత్నిస్తుంటే.. ఎలగైనా గెలవాలని తెలుగదేశం పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా విజయం సాధిస్తామని జనసేన-బీజేపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక జరగనుండగా.. మే 2న ఫలితాలను వెల్లడిస్తారు. తిరుపతి లో విజయం సాధించి , తమ ప్రభుత్వం పై ప్రజల్లో ఉన్న విశ్వాసం చాటిచెప్పాలని వైసీపీ విజయం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అలాగే తిరుపతి లో విజయం వైసీపీదే అని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే భారీ మెజారిటీ తో వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్తున్నారు. ఇక టీడీపీ ఎలాగైనా గెలవాలని చంద్రబాబు , లోకేష్ , అచ్చెన్నాయుడు వంటి నేతలు క్షణం తీరిక లేకుండా ప్రచార పర్వంలో పాల్గొంటున్నారు. మొత్తంగా తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సమయం మరికొన్ని గంటల్లోనే ముగియనుంది. దీనితో ఈ కొంత సమయాన్ని ఏ పార్టీ ఏ విదంగా ఉపయోగించుకుంటుందో చూడాలి.