టీడీపీకి షాక్‌...జ‌న‌సేన‌లోకి ఆ ఎమ్మెల్యే

Update: 2018-09-18 04:28 GMT
తిరుప‌తి ఎమ్మెల్యే సుగుణ‌మ్మ మ‌రోమారు సంచ‌ల‌న వార్త‌తో తెర‌మీద‌కు వ‌చ్చారు. ఈ ద‌ఫా గ‌తం కంటే సంచ‌ల‌న ప‌రిణామంతో ఎమ్మెల్యే వార్త‌ల్లో నిలిచారు. ఇటీవ‌ల‌ మహా సంప్రోక్షణకు హాజరవ్వడం కోసం తిరుమల వెళ్లిన ఎమ్మెల్యే సుగుణమ్మను అనుమతి లేదంటూ ఆమెను టీటీడీ సిబ్బంది అడ్డుకోవ‌డం... త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనే టీటీడీ అధికారుల చేతిలో ప‌రాభ‌వం ఎదుర‌వ‌డంతో తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం...టీటీడీ పాలకమండలి ‌సభ్యులను అనుమతించి తనను ఎందుకు అనుమతించరని - టీటీడీ అధికారుల తీరును సూటిగా ప్ర‌శ్నిస్తూ ఈ విష‌య‌మై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తాన‌ని తేల్చిచెప్పడం...తెలిసిన సంగ‌తే. అయితే తాజాగా సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో ఆమె గైర్హాజ‌ర‌వ‌డం క‌ల‌క‌లం సృష్టించ‌గా - ఆమె జ‌న‌సేన‌లో చేరనున్నార‌నే వార్త రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

బ్ర‌హ్మోత్స‌వాల‌కు హాజ‌ర‌య్యేందుకు సీఎం చంద్ర‌బాబు తిరుప‌తికి వెళ్ల‌గా స్థానిక శాస‌న‌స‌భ్యురాలు అయిన సుగుణ‌మ్మ గైర్హాజ‌రు అయ్యారు. ఈ వార్త మీడియాలో వైర‌ల్ అయిన నేప‌థ్యంలో...జిల్లాకు చెందిన మంత్రి అమ‌ర‌నాథ్‌ రెడ్డితో ఆమె గైర్హాజ‌రి వివ‌రాలు తెలుసుకోవాల‌ని బాబు ఆదేశించారు. స్వామి వారి మహా శాంతి తిరుమంజననికి ఆలయంలోకి స్థానిక ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టికీ తనకు అనుమతించిన లేద‌ని, ఈ విష‌యంలో టీటీడీ అధికారుల‌పై ప్ర‌భుత్వ వైఖ‌రి స‌రిగా లేద‌ని ఆమె వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం.  ఉందా లేదా అని టీటీడీ అధికారులను ప్రశ్నించారు. తనకు జరిగిన అవమానంపై టీటీడీ ఈఓకు - సీఎంకు  ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ప్ర‌క‌టించారు.

దీనికి కొనసాగింపుగా మ‌రో సంచ‌ల‌న ప‌రిణామం చోటుచేసుకుంది. సుగుణ‌మ్మ జ‌న‌సేన పార్టీలో చేర‌నున్నట్లు ఇటీవ‌లి కాలంలో ఆ పార్టీ వార్తాంశాల‌ను ప్రాధాన్యంగా ప్ర‌సారం చేస్తున్న 99టీవీ వెల్ల‌డించింది. త్వ‌ర‌లో ఈ చేరిక ఉంటుంద‌ని పేర్కొంది. సుగుణ‌మ్మ స‌హా ఆమె భ‌ర్త వెంక‌ర‌మ‌ణ‌కు చిరంజీవి కుటుంబంతో స‌న్నిహిత సంబంధాలు ఉన్న నేప‌థ్యంలో ఆమె జ‌న‌సేనలో చేర‌వ‌చ్చ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఈ విష‌యంలో స్ప‌ష్ట‌త రావాలంటే మ‌రికొన్ని రోజులు వేచి చూడాల్సింది. కాగా, 2014లో త‌న భ‌ర్త వెంక‌ట‌ర‌మ‌ణ మ‌ర‌ణంతో సుగుణ‌మ్మ టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దిగి గెలుపొందారు.

Tags:    

Similar News