అమీర్ ‘లక్ష’కు.. ఉద్దవ్ ‘2 లక్షల’ రిటార్ట్

Update: 2015-11-28 04:39 GMT
‘‘చెంపకు చేయి పరమైనప్పుడు కంటికి నీరు ఆదేశమవును’’ అన్నట్లుగానే సాగుతున్నాయి ప్రస్తుత పరిస్థితి. తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా అన్నట్లుగానే రియాక్ట్ అవుతున్న తీరు ఇప్పుడు కనిపిస్తోంది. దేశంలో అసహనం పెరిగిపోతుందని.. తన భార్య తనతో దేశం విడిచిపెట్టి వెళదామని చెప్పిందంటూ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అమీర్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే.. అందరి దారి ఒకటైతే.. పంజాబ్ కు చెందిన శివసేన సైనికులు దారి మరొకటిగా మారింది.

అమీర్ వ్యాఖ్యలు అందరూ మాటలతో నిరసన తెలిసితే.. పంజాబ్ శివసేన నేతలు మాత్రం వయిలెంట్ గా రియాక్ట్ అయి.. లూధియానాలో జరుగుతున్న అమీర్ చిత్రం షూటింగ్ కోసం బస చేసిన హోటల్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్ సిబ్బంది కానీ.. షూటింగ్ సిబ్బంది కానీ అమీర్ ఖాన్ ను చెంపదెబ్బ కొడితే రూ.లక్ష నజరానా ఇస్తామని.. ఆ పని చేసిన వారిని దేశ భక్తుడిగా చూస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. అమీర్ ను కొట్టే ప్రతి చెంపదెబ్బకు రూ.లక్ష చొప్పున ఇస్తామన్నారు.

ఈ వ్యాఖ్యల్ని పలువురు తప్పుపట్టారు. ఇదిలా ఉంటే.. అమీర్ మీద పంజాబ్ శివసేన నేతలు చేసిన ప్రకటనపై తమిళనాడుకు చెందిన తవ్ హీద్ జమాత్ మరింత వయిలెంట్ గా  స్పందించింది. ఆ సంస్థ సహాయ కార్యదర్శి తవ్ బీక్ మాట్లాడుతూ.. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ను చెంపదెబ్బ కొట్టినోళ్లకు రూ.2లక్షలు ఇస్తామని ఆపర్ ప్రకటించారు. శివసేన చేస్తున్న ప్రకటనలకు తాము బెదిరిపోమని.. ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన వ్యాఖ్యానించారు. శివసేన నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఎవరూ సమర్థించరు. అదే సమయంలో తవ్ హీద్ జమాత్ సంస్థ మాటల్ని ఎవరూ హర్షించరు.

ఇక్కడో మరో కీలకమైన పాయింట్ ఏమిటంటే.. అమీర్ వ్యాఖ్యలపై శివసేన అగ్రహం వ్యక్తం చేస్తే.. అమీర్ పేరు మీద తవ్ హీద్ జమాతే మాత్రం.. మతాన్ని సీన్లోకి తీసుకురావటం గమనార్హం. తాము బెదిరిపోమని.. ధైర్యంగా ఎదుర్కొంటామన్న వ్యాఖ్యలు చూసినప్పుడు.. ఉద్ధవ్ రూ.2లక్షల ఆఫర్ అమీర్ మీద అభిమానం అనే కంటే.. అమీర్ ముస్లిం కావటం వల్లే తాము రియాక్ట్ అయ్యామన్నట్లుగా ప్రకటించటం ఏమిటి? చూస్తుంటే.. అసహనం అనే ఆరోపణలో ఇలాంటి కోణాల్ని ఎవరూ ఎందుకు చర్చకు పెట్టరో..?
Tags:    

Similar News