వేలెత్తి చూపించటంతోనే సరిపోదు. ఒక వేలు ఎత్తి చూపిస్తే.. నాలుగు వేళ్లు మన వైపు చూస్తుంటాయన్న చిన్న విషయాన్ని మోడీ బ్యాచ్ మిస్ అయ్యింది. ఇదే ఇప్పుడా పార్టీకి భారీ డ్యామేజ్ చేసేలా చేసింది. రాజకీయాల్లో విమర్శలు.. ఆరోపణలు మామూలే. అయితే.. దానికి ఒక పద్దతి పాడు ఉంటుంది.
ఎంత దూకుడు రాజకీయమైనా మరణించిన వారి విషయంలో మినహాయింపులు ఇస్తుంటారు. కానీ.. మోడీ పరివారానికి ఆ విషయం మీద కూడా పట్టింపు లేనట్లుగా కనిపిస్తోంది. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రును స్త్రీలోలుడిగా చూపించే ప్రయత్నం చేసిన బీజేపీ ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యింది. బీజేపీకి చెందిన కీలక నేత ఒకరు చేసిన తప్పు ఇప్పుడా పార్టీ గొంతులో పచ్చి ఎలక్కాయ పడేలా చేసింది.
దిద్దుకోలేని తప్పు చేసి అడ్డంగా బుక్ అయిన బీజేపీ.. ఇప్పుడు చెంపలు వేసుకోవటం మినహా మరో మార్గం కనిపించని పరిస్థితి. గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ.. కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టేందుకు వీలుగా ఒక అహస్యమైన పోస్టును సిద్ధం చేశారు బీజేపీ జాతీయ ఐటీ విభాగం.
దీనికి ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్న అమిత్ మాలవీయ చేసిన తప్పు అధికారపార్టీని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గుజరాత్ లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్న పటేళ్ల ఉద్యమనేత హార్దిక్ పటేల్ ను డిఫెన్స్ లో పడేసేందుకు వీలుగా నెహ్రు మీద ఒక చౌకబారు పోస్ట్‌ను సిద్ధం చేశారు. నెహ్రూను స్త్రీ లోలుడిగా చూపించే ప్రయత్నం చేస్తూ.. పలువురు మహిళలతో ఆయన సన్నిహితంగా ఉన్న ఫోటోలతో కూడిన పోస్ట్‌ను రెఢీ చేశారు.
దీనికి ట్యాగ్ లైన్ గా చూస్తుంటే హార్దిక్ కు నెహ్రూ డీఎన్ ఏ బాగా ఎక్కువ ఉన్నట్టుందంటూ టైమ్లీ పంచ్ ఇవ్వాలన్న తొందరలో భారీ తప్పు చేశారు. నెహ్రూతో ఆత్మీయంగా ఉన్న ఆయన సోదరి విజయలక్ష్మీ పండిట్ ఫోటోలను సైతం తాజా పోస్టులో పెట్టేశారు. ఈ పోస్టులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టులో పెట్టిన మిగిలిన ఫోటోలు కూడా అభ్యంతరకరంగా ఏమీ లేవన్న అభిప్రాయాన్ని పలువురు వెల్లడిస్తున్నారు. అమిత్ మాలవీయ నీచబుద్ధిని తాజా పోస్ట్ బయటపెడుతుందంటూ పలువురు మండిపడుతున్నారు. బుదర జల్లాలి కానీ జెంటిల్ గా ఉండాలి. అంతే తప్పించి ఎవరి ఫోటో పడితే వారిది.. ఈ లోకంలో లేని వారి మీద తప్పుడు విమర్శలు చేయకూడదన్న కామన్ సెన్స్ మిస్ అయితే ఇలాంటి ఇబ్బందే ఎదురవుతుంది మరి.