జ‌గ్గారెడ్డి.. అటా? ఇటా?

Update: 2022-03-07 15:30 GMT
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి పార్టీలో కొన‌సాగుతారా? లేదా? ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌కటించిన ఆయ‌న‌.. ఇప్పుడు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు జ‌గ్గారెడ్డి పార్టీలోనే కొన‌సాగుతార‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు కూడా అంటున్నారు. తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న వైనం రోజుకో చ‌ర్చ‌కు దారితీస్తోంది.

మాట్లాడ‌నివ్వ‌లేద‌ని..

తాజాగా తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా జ‌రిగిన సీఎల్పీ భేటీని జ‌గ్గారెడ్డి బాయ్‌కాట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్టీలోని అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల కార‌ణంగానే జ‌గ్గారెడ్డి సీఎల్పీ స‌మావేశం నుంచి వెళ్లిపోయార‌ని స‌మాచారం. త‌న‌కు క‌నీస స‌మాచారం లేకుండానే టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మెద‌క్‌లో ప‌ర్య‌టించ‌డంపై జ‌గ్గారెడ్డి ఆగ్ర‌హంగా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో సీఎల్పీ భేటీలో రేవంత్ వైఖ‌రిపై దుమ్ము దుల‌పాల‌ని ఆయ‌న భావించారు. కానీ ఆయ‌న‌కు నిరాశే ఎదురైంద‌ని తెలిసింది. ఈ స‌మావేశంలో పార్టీ అంత‌ర్గ‌త విష‌యాలు మాట్లాడ‌కూడ‌ద‌ని చెప్ప‌డంతో ఆయ‌న మ‌ధ్య‌లోనే వెళ్లిపోయారు. స‌మావేశంలో చాలా విష‌యాలు మాట్లాడాల‌నుకున్నా.. కానీ వ‌ద్ద‌న్నారు కాబ‌ట్టి వెళ్లిపోతున్నాన‌ని ఆయ‌న చెప్పారు.

పార్టీలోనే ఉంటారు..

మ‌రోవైపు త‌న రాజీనామా నిర్ణ‌యాన్ని జ‌గ్గారెడ్డి ఉప సంహ‌రించుకుంటార‌ని పార్టీలోని సీనియ‌ర్ నేత‌లు అంటున్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్ల‌ర‌ని పార్టీలోనే కొన‌సాగుతార‌ని వాళ్లు చెబుతున్నారు. పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించిన జ‌గ్గారెడ్డి ఆ త‌ర్వాత త‌న నిర్ణ‌యాన్ని వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోసం ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. అలాగే ల‌క్ష మందితో సంగారెడ్డిలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి త‌న బలాన్ని చాటాల‌నుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌గ్గారెడ్డి మాత్రం పార్టీలోని కొన‌సాగుతార‌ని సీనియ‌ర్లు చెప్ప‌డం విశేషం. మ‌రోవైపు అధిష్టానం నుంచి కూడా ఆయ‌న‌కు హెచ్చ‌రిక‌లు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ప్ర‌తి విష‌యాన్ని మీడియాకు ఎక్కి ర‌చ్చ చేయ‌డం స‌రికాదంటూ హైక‌మాండ్ చెప్పిన‌ట్లు తెలిసింది. ఈ ప‌రిస్థితుల్లో మ‌రి జ‌గ్గారెడ్డి పార్టీలో ఉంటారా? ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News