Top News: ఈరోజు ముఖ్యాంశాలు

Update: 2019-01-24 11:58 GMT
1. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీలో ప్రముఖ తమిళ దర్శకనటుడు సముద్రఖని ఎంపికయ్యాడు. రాజమౌళి అడగగానే చేయడానికి ఒప్పుకున్నట్టు ఆయన తెలిపారు.

2.తెలంగాణ ఎన్నికల్లో అధికారులు , పోలీసులు టీఆర్ఎస్ కు సహకరించారని.. వారే డబ్బులు పంచారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సంచలన ఆరోపణలు చేశారు.

3.కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరసన చేపట్టింది.

4. ఎస్సీ, ఎస్టీ వేధింపుల సవరణ చట్టం సవరణపై స్టేకు సుప్రీం కోర్టు తాజాగా నిరాకరించింది. దీంతో ఆ కేసు అన్యాయంగా ఇరికించిన వారికి ఊరట కలిగే అవకాశాలున్నాయి.

5.వైసీపీని వీడిన వంగవీటి రాధాపై జగన్ పై, మీడియా ప్రతినిధులపై ఫైర్ అవ్వడం సంచలనం రేపింది.

6. ఎక్కువమంది పిల్లలను కంటే ఓటుహక్కు,ప్రభుత్వ పథకాలు రద్దు చేయాలని యోగా గురువు బాబా రాందేవ్ స్పష్టం చేశారు.

7. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ కు సొంత నియోజకవర్గం అమేథిలో ఘోర అవమానం ఎదురైంది. రైతులు రాహుల్ గో బ్యాక్ అంటూ నిరసన తెలిపారు.

8.నటి హన్సిక ఫోన్ హ్యాక అయ్యిందని.. ఆమె నగ్న ఫొటోలు లీక్ అయ్యాయని తెలుస్తోంది. కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

9. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్ పేపర్లు వాడమని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది.

10.వేరు శనగ నూనెల పేరుతో జనాలకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన గ్రీన్ బయోటెక్ సంస్థ ఎండీ శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

11.సాక్షి జర్నలిస్టుపై టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వీరంగం సృష్టించారు. బూతులతో తిడుతూ కెమెరామెన్ నానిపై దౌర్జాన్యానికి దిగారు.

12. టెలికాం సంచలనం రియలన్స్ జియో తాజాగా జియో యూజర్ల కోసం రెండు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.594, రూ.297 పేరుతో ప్రీ పెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది.

13.నిన్న కోహ్లీ సేన న్యూజిలాండ్ పురుషులను జట్టును ఓడిస్తే.. ఈరోజు మహిళల జట్టు న్యూజిలాండ్ జట్టును ఓడించింది.

14.భారత ఈకామర్స్ మార్కెట్లోకి భారత అపరకుబేరుడు ముఖేష్ అంబానీ దిగబోతున్నారు. దీంతో వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్  లకు ఇక గట్టిపోటీ ఎదురుకాబోతోంది.

15.కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి వైసీపీకి లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు.

16. యోగా గురు రాందేవ్ బాబా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే వారి ఓటు హక్కును తొలగించాలని చెబుతున్నారు. అంతేనా ప్రభుత్వ ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు వంటిని తొలగిస్తే జనాభా నియంత్రణ సాధ్యపడుతుందని అంటున్నారు.

17. యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాలపై హాస్యనటుడు అలీ చేసిన సెటైర్ వ్యాఖ్యలు కలకలం రేపాయి.

18. పరువు హత్యలో భార్యను కోల్పోయిన అమృతకు మగబిడ్డ జన్మించాడు. మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో అమృత మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు ఆమె అత్తామామలు తెలిపారు. తల్లి బిడ్డలు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.

19.జర్నలిస్టు మిత్రులతో పిచ్చాపాటిగా మాట్లాడిన కేటీఆర్.. ‘తన తండ్రి మాదిరిగా తనకు ఉదారత్వం లేదని.. తమను.. తమ పార్టీని నష్టపరిచేలా చేసే చర్యల్ని తాను ఉపేక్షించనని’ వారితో చెప్పడం సంచలనం రేపుతోంది. ఎన్నికల వేళ టీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకు కుట్రపన్నిన మీడియాను, నాయకులను అంత ఈజీగా వదిలిపెట్టనని కేటీఆర్ చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

20.భాను ప్రియ ఇంట్లో పనికోసం 14 ఏళ్ల తన కూతురును పంపానని.. ఆర్థిక ఇబ్బందుల వల్ల పనికి పెడితే ఆమెను భానుప్రియ ఫ్యామిలీ వేధింపులకు గురిచేశారని ప్రభావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది..  
    

Tags:    

Similar News