ఏపీ రాజధాని నగరమైన అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రాజకీయ నాయకులే కాదు సినీ ప్రముఖులూ తరలివచ్చారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వివిధ రంగాల వారు పెద్ద సంఖ్యలో రావడంతో ఆంధ్ర కొత్త రాజధాని అమరావతికి అప్పుడే సినీ శోభ వచ్చేసింది. శంకుస్థాపన కార్యక్రమానికి సినీ ప్రముఖులు వెంకటేష్ - కృష్ణంరాజు - సుమన్ తదితరులు సభా ప్రాంగాణానికి తరలివచ్చారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ దంపతులు, దీంతో అమరావతి ప్రాంగణం కోలాహాలంగా మారింది. మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ సభాప్రాంగణానికి చేరుకున్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్, సినీ నిర్మాత అయిన రామోజీరావు వచ్చారు. ఆలీ - చలపతిరావు తదితర నటులూ హాజరయ్యారు. శంకుస్థాపన సమయానికి మరింతమంది సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.
నభూతో నభవిష్యత్ అన్న చందంగా సాగుతున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి దేశ విదేశీ ప్రముఖులతోపాటు ప్రజలు కూడా తండోపతండాలుగా తరలిరావడంతో సభాప్రాంగణమంతా క్రిక్కిరిసిపోయింది. ఎక్కడ చూసినా జన ప్రభంజనం కదలాడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతివారిలోనూ ఒక అద్భుత కార్యక్రమంలో పాల్గొంటున్నామన్న ఉత్తేజం, ఉత్సాహం కనిపిస్తున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు రావడమే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న ఆంధ్రులు కూడా పెద్దసంఖ్యలో అమరావతికి చేరుకున్నారు. నిజానికి దసరా పండుగ ఉన్నప్పటికీ అమరావతి శంకుస్థాపనను అంతకంటే పెద్ద పండుగగా ప్రజలు భావిస్తున్నారు. దీంతో అమరావతి ప్రాంగణం ఇప్పటికే ఇసుకేస్తే రాలనంతలా కిటకిటలాడుతోంది.